Meetha Raghunath: వివాహబంధంలోకి అడుగుపెట్టిన ‘గుడ్‌నైట్‌’ స్టార్‌

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నటాషా దోషి, కృతికర్భందా వంటి కథానాయికలు ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో యువ నటి చేరింది.

Updated : 18 Mar 2024 10:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిత్రపరిశ్రమలో ఈ ఏడాది పెళ్లి బాజాలు కాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నటాషా దోషి, కృతికర్భందా వంటి కథానాయికలు ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో యువ నటి చేరింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. మీతా రఘునాథ్‌(Meetha Raghunath).

‘గుడ్‌నైట్‌’ (Goodnight)తో విజయాన్ని అందుకున్న కోలీవుడ్‌ భామ మీతా రఘునాథ్‌. రొమాంటిక్‌ కామెడీగా రూపొందించిన ఈ చిత్రంలో ఆమె నటనకు సినీ ప్రియులు మనసు పారేసుకున్నారు. ఆమె వివాహబంధంలోకి అడుగుపెట్టారు. జీవిత భాగస్వామితో కలిసి దిగిన ఫొటోలను తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘నా హృదయం’ అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన భర్త పేరేంటి? వివాహం ఎప్పుడు జరిగింది? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. మీతా సొంతూరు ఊటీలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగినట్లు సమాచారం. మరోవైపు, ‘గుడ్‌నైట్‌’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆమె జె.ఎఫ్‌.డబ్ల్యూ మూవీ అవార్డును సొంతం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని