Tiger 3: టవల్‌ ఫైట్‌ అద్భుతం

‘నాకు, కత్రినాకు మధ్య హమామ్‌లో చిత్రీకరించిన టవల్‌ ఫైట్‌ సన్నివేశం అద్భుతంగా ఆకట్టుకుంది’ అని అంటోంది మిచెల్‌ లీ.

Updated : 28 Oct 2023 14:06 IST

‘నాకు, కత్రినాకు మధ్య హమామ్‌లో చిత్రీకరించిన టవల్‌ ఫైట్‌ సన్నివేశం అద్భుతంగా ఆకట్టుకుంది’ అని అంటోంది మిచెల్‌ లీ. స్కార్టెట్‌ జాన్సన్‌ సినిమా ‘బ్లాక్‌ విడో’, జానీ డెప్‌ చిత్రం ‘పైరెట్స్‌ ఆఫ్‌ కరేబియన్‌’, బ్రాడ్‌ పిట్‌ మూవీ ‘బుల్లెట్‌ ట్రెయిన్‌’, టామ్‌ హర్డీ ‘వెనమ్‌’ లాంటి హలీవుడ్‌ చిత్రాల్లో కళ్లుచెదిరే యాక్షన్‌ సన్నివేశాల్లో నటించి మెప్పించిన హాలీవుడ్‌ నటి మిచెల్‌ లీ తాజాగా ‘టైగర్‌ 3’లో మరోసారి వావ్‌ అనిపించే యాక్షన్‌ సీక్వెన్స్‌లో కనిపించనుంది. బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ఈ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్ర ట్రైలర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో కత్రినా, మిచెల్‌ లీ మధ్య ఉన్న టవల్‌ ఫైట్‌ సీన్‌ ఓ సన్నివేశంలో చూపించారు. ఆ ఒక్క సీన్‌ సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది. దాని గురించి మిచెల్‌ మాట్లాడుతూ...‘కత్రినాతో ఆ ఫైట్‌ సీన్‌ను ఎలా చేయాలి, ఎంత కొత్తగా చేస్తే ప్రేక్షకులు దానికి కనెక్ట్‌ అవుతారనే దానిపై దృష్టి పెట్టి రెండు వారాల పాటు రీసెర్చ్‌ చేశాము’ అని తెలిపింది. ‘ఫైట్‌ డిజైన్‌ చేసిన తీరు అద్భుతం. కత్రినా ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌కోసం కష్టపడింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమా నవంబరు 12న రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని