Monster: ఆకట్టుకుంటున్న మోహన్‌లాల్‌ ‘మాన్‌స్టర్‌’ ట్రైలర్‌...!

మోహన్‌లాల్‌ నటించిన ‘మాన్‌స్టర్‌’ సినిమా మిస్టరీ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 09 Oct 2022 16:11 IST

హైదరాబాద్‌: మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మాన్‌స్టర్’. ఈ సినిమా ట్రైలర్‌ ఈరోజు(october9)న విడుదలైంది.  మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లెజెండరీ నటుడు మోహన్‌లాల్‌ ఈ సినిమాలో లక్కీ సింగ్‌ అనే పాత్రలో నటిస్తున్నారు. సుమారు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ సస్పెన్స్‌తో కూడి ఉంది. ఒక మిస్సింగ్‌ కేసు చూట్టూ ఈ కథ తిరుగుతుందని అర్థమవుతోంది. మోహాన్‌లాల్‌ నటించిన ఈ సినిమాపై అటు సినీ ప్రియులు, ఇటు సూపర్‌ స్టార్‌ మోహాన్‌లాల్‌ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు వైశాఖ్‌ దర్శకత్వం వహిస్తుండగా దీపక్ దేవ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక హనీ రోజ్‌, సుదేవ్‌ నాయర్‌, గణేష్‌ కుమార్‌ నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు నటి మంచు లక్ష్మి కీలకపాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం మోహన్‌లాల్‌ ఈ సినిమాతో పాటు ‘రామ్’ సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ‘రామ్‌’లో త్రిష, సుకుమారన్‌ ముఖ్య పాత్రలు పోషించనున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు