Balakrishna: వాయిదా వార్తలకు చెక్‌.. ‘భగవంత్‌ కేసరి’ వచ్చేది ఆరోజే!

‘భగవంత్‌ కేసరి’గా సినీప్రియుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు బాలకృష్ణ (Balakrishna). తాజాగా ఈ సినిమా విడుదల విషయంలో వస్తోన్న వార్తలపై సినిమా యూనిట్‌ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చింది.

Updated : 18 Sep 2023 11:02 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). ఇప్పటికే ఈ సినిమాలోని ‘గణపతి బప్పా మోరియా’ పాటను విడుదల చేసి అభిమానుల్లో జోష్‌ నింపింది చిత్రబృందం.  అయితే, రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌తో వాటికి చిత్రబృందం చెక్‌ పెట్టింది.

ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 19న విడుదల చేయనున్నట్లు గతంలో మూవీ యూనిట్‌ ప్రకటించింది. అయితే, తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా విడుదల వాయిదా పడనుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై క్లారిటీ ఇస్తూ మూవీ యూనిట్‌ ఓపోస్టర్‌ విడుదల చేసింది. అందులో రిలీజ్‌ డేట్‌ అక్టోబర్‌ 19 ఉండడంతో అభిమానులు సంబర పడుతున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్‌ కూడా చివరి భాగంలో ఉంది. మరో వారంలోపు చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?

ఇక ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’లతో వరుసగా బ్లాక్‌ బస్టర్‌ విజయాలను అందుకున్న బాలకృష్ణ (Balakrishna)ఈ సినిమాతో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు. ఇప్పటికే దీని టీజర్‌కు భారీ స్పందన రాగా.. తాజాగా విడుదల చేసిన పాట కూడా మిలియన్‌ వ్యూవ్స్‌తో యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. బాలకృష్ణ మార్క్‌ యాక్షన్‌ అంశాలతో పాటు అనిల్‌ శైలి వినోదాలతో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని