Mrunal thakur: సీత స్పెషల్‌ విషెస్‌.. రామ్ ఏమన్నారంటే..?

నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) స్పెషల్‌ పోస్ట్‌ పెట్టారు.

Updated : 28 Jul 2023 16:44 IST

హైదరాబాద్‌: ‘సీతారామం’(Sitaramam)తో తెలుగువారి మది గెలిచిన జంట మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur), దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan). సీత - రామ్‌గా వీరిద్దరూ సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తిండిపోయేలా నటించారు. కాగా, శుక్రవారం దుల్కర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్‌మీడియా వేదికగా ఆయనకు మృణాల్‌ ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు. ‘సీతారామం’ సెట్‌లో దిగిన కొన్ని ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.

‘‘వినయం, టాలెంట్‌, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనసు కలిగిన ఇలాంటి సూపర్‌స్టార్‌ను నాకు పరిచయం చేసిన ‘సీతారామం’ మేకర్స్‌కు ఎప్పటికీ కృతజ్ఞతలు. దుల్కర్‌.. ఎన్నో విధాలుగా నువ్వు నాలో స్ఫూర్తి నింపావు.  నీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కొత్త భాషలు నేర్చుకోవాలంటే భయపడే నాలో ధైర్యాన్ని నింపినందుకు.. మలయాళీ సాంగ్స్‌ను నాకు పరిచయం చేసినందుకు.. నా మొదటి తెలుగు చిత్రాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చినందుకు.. థ్యాంక్యూ. హ్యాపీ బర్త్‌డే దుల్కర్‌ సల్మాన్‌! నాకు ఇలాంటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందించినందుకు ఎప్పటికీ ధన్యవాదాలు’’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

ఓటీటీలో నాగశౌర్య ‘రంగబలి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కాగా, మృణాల్‌ ట్వీట్‌పై స్పందించిన దుల్కర్‌.. ‘‘మృణాల్‌.. ఇది ప్రత్యేకంగా ఉంది. నీలో ప్రేరణ నింపేందుకు వేరే వ్యక్తులు అవసరం లేదు. ఎందుకంటే, నువ్వెంతో ప్రత్యేకమైన వ్యక్తివి. ఒకటి మాత్రం చెప్పగలను. నువ్వు ఎప్పటికీ సీత గారుగానే గుర్తుండిపోతావు’’ అని అన్నారు. వీరి సంభాషణ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తోంది. వీరిద్దరి కాంబోలో మరో సినిమా చూడాలనుకుంటున్నామని సినీ ప్రియులు కామెంట్స్‌ పెడుతున్నారు. ‘సీతారామం 2’ చేయొచ్చుగా అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని