Rangabali ott release: ఓటీటీలో నాగశౌర్య ‘రంగబలి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Rangabali ott release date: నాగశౌర్య, సత్య కీలక పాత్రల్లో నటించిన ‘రంగబలి’ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Published : 28 Jul 2023 14:32 IST

Rangabali ott release: నాగశౌర్య (Naga Shaurya) కథానాయకుడిగా పవన్‌ బాసంశెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగబలి’ (Rangabali). ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. జులై 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా నాగశౌర్య, సత్య కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌వేదికగా ఆగస్టు 4న ‘రంగబలి’ (Rangabali ott release) స్ట్రీమింగ్‌ కానుంది.

రివ్యూ: బ్రో.. పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ల మూవీ మెప్పించిందా?

క‌థేంటంటే: శౌర్య (నాగ‌శౌర్య‌)కు త‌న ఊరు రాజ‌వ‌రం అంటే పిచ్చి ప్రేమ‌. అదే త‌న బ‌లం.. బ‌ల‌హీన‌త‌. ఏదేమైనా స‌రే సొంతూరులోనే కింగులా బ‌త‌కాలి అనుకుంటాడు. తను ఏం చేసినా ప‌ది మంది చూపు త‌న‌పైనే ఉండాల‌ని అనుకుంటాడు. ఇందుకోసం అప్పుడ‌ప్పుడు కాస్త షో చేస్తుంటాడు. అందుకే త‌న ఫ్రెండ్స్ అత‌న్ని షో అని పిలుస్తుంటారు. శౌర్య తండ్రి విశ్వం (గోప‌రాజు ర‌మ‌ణ‌) ఊళ్లోనే మెడిక‌ల్ షాపు నిర్వ‌హిస్తూ గౌర‌వంగా జీవిస్తుంటాడు. త‌న కొడుక్కు ఆ షాపు బాధ్య‌త అప్ప‌గించాల‌న్నది ఆయ‌న కోరిక‌. అయితే శౌర్య మాత్రం ఊళ్లో గొడ‌వ‌లు పెట్టుకుంటూ.. సొంత షాపులోనే చిల్ల‌ర దొంగ‌త‌నాలు చేస్తూ స‌ర‌దాగా బ‌తికేస్తుంటాడు. (Rangabali review) అత‌న్ని దారిలో పెట్టాల‌న్న ఉద్దేశంతో బ‌ల‌వంతంగా వైజాగ్ పంపిస్తాడు విశ్వం. అక్క‌డ తండ్రి కోరిక మేర‌కు ఫార్మ‌సీ ట్రైనింగ్ కోసం ఓ మెడిక‌ల్ కాలేజీలో చేర‌తాడు శౌర్య‌. అక్క‌డే స‌హ‌జ (యుక్తి త‌రేజ‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. వీళ్ల ప్రేమ‌కు స‌హ‌జ తండ్రి (ముర‌ళీ శ‌ర్మ‌) తొలుత అంగీకారం తెలిపినా.. శౌర్య‌ది రాజ‌వ‌రం అని తెలిసి పెళ్లికి అడ్డు చెబుతాడు. దీనికి కార‌ణం ఆ ఊర్లోని రంగ‌బ‌లి సెంట‌ర్‌. మ‌రి ఆ సెంట‌ర్ క‌థేంటి? (Rangabali) దానికి రంగ‌బ‌లి అన్న పేరు ఎందుకొచ్చింది? ఈ సెంట‌ర్‌కు ముర‌ళీ శ‌ర్మ‌కూ. ఆ ఊర్లోని ఎమ్మెల్యే ప‌ర‌శురామ్ (షైన్ టామ్‌ చాకో)కు ఉన్న సంబంధం ఏంటి? ఈ సెంట‌ర్ పేరు మార్చి.. త‌న ప్రేమ‌ను పెళ్లి పీట‌లెక్కించేందుకు శౌర్య ఏం చేశాడు? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని