My Dear Bootham: తెలుగు చిత్రసీమే నన్ను పైకి తీసుకొచ్చింది!

‘‘నాకు హోం గ్రౌండ్‌ లాంటిది తెలుగు చిత్రసీమ’’ అన్నారు ప్రభుదేవా. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మై డియర్‌ భూతం’. రమ్య నంబీశన్‌ కథానాయిక.

Updated : 11 Jul 2022 08:48 IST

‘‘నాకు హోం గ్రౌండ్‌ లాంటిది తెలుగు చిత్రసీమ’’ అన్నారు ప్రభుదేవా (Prabhudeva). ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మై డియర్‌ భూతం’ (My Dear Bootham). రమ్య నంబీశన్‌ (Ramya) కథానాయిక. ఎన్‌.రాఘవన్‌ దర్శకత్వం వహించారు. రమేష్‌ పి.పిళ్లై నిర్మాత. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఏఎన్‌ బాలాజీ ఈ నెల 15న చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుదేవా మాట్లాడుతూ ‘‘నన్ను పైకి తీసుకొచ్చింది తెలుగు చిత్రసీమే. నా సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుండడం ఆనందంగా ఉంది. బృందం అంతా కష్టపడి ఓ మంచి సినిమాని తయారుచేసింది. తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. వేదికపై స్టెప్పులు వేసి సభికుల్ని అలరించారు ప్రభుదేవా. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నేనీ కథని ప్రభుదేవాని దృష్టిలో పెట్టుకునే రాశా. నిర్మాతకి చెప్పలేదు. ఆయనే స్క్రిప్ట్‌ అంతా చదివి దీనికి ప్రభుదేవా అయితేనే బాగుంటుంద’’న్నారు. నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘రమేష్‌ పిళ్లై విజయవంతమైన నిర్మాత. ట్రైలర్‌, పాటలు చాలా బాగున్నాయి. పిల్లలు తప్పకుండా ఈ సినిమాని ఆస్వాదిస్తార’’న్నారు. ‘‘ప్రభుదేవా సినిమాకి పాటలు రాసినందుకు గర్వపడుతున్నా. ఇమ్మాన్‌ స్వరాలు, ప్రభుదేవా మాస్టర్‌ స్టెప్పులు చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు గీత రచయిత చల్లా భాగ్యలక్ష్మి. ఈ కార్యక్రమంలో రచయిత నందు తుర్లపాటి, ఏఎన్‌ బాలాజీ, రమ్య నంబీశన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని