Pawan kalyan: పవన్‌ ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ టీమ్..

పవన్‌ కల్యాణ్‌-హరీశ్‌ శంకర్‌ కాంబోలో రానున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుంచి ఓ అప్‌డేట్ ఇవ్వునున్నట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది.

Published : 16 Mar 2024 14:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ రూపొందిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని రెండేళ్ల క్రితమే ప్రకటించారు. అయితే దీనిపై అప్‌డేట్‌ వచ్చి చాలా రోజులు కావడంతో రకరకాల రూమర్స్ వినిపించాయి. తాజాగా వాటికి చెక్‌ పెడుతూ నిర్మాణ సంస్థ ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచేలా ఓ పోస్ట్‌ పెట్టింది.  ‘‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుంచి మీరు ఊహించని అప్‌డేట్‌ రానుంది. సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది. చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వస్తుందని తెలియడంతో ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు. ‘టీజర్ ఉంటుందా’, ‘కొత్త పోస్టర్‌ విడుదల చేస్తారా’ అని రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. దీనికి హరీశ్‌ శంకర్‌ కూడా రిప్లై ఇస్తూ ‘నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.

అవన్నీ ఫేక్‌ వార్తలు.. ‘అనారోగ్యం’పై అమితాబ్‌ క్లారిటీ

పవన్‌ కల్యాణ్‌ పోలీస్ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో ఆయన సరసన శ్రీలీల నటిస్తున్నారు. ‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత పవన్‌-హరీశ్‌ శంకర్‌ కాంబోలో వస్తోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల హరీశ్ శంకర్‌ ఓ ఇంటర్వ్యూలో పవన్‌కల్యాణ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘గబ్బర్‌ సింగ్‌’ సమయంలో ఆయన ఎంత ఎనర్జీతో ఉన్నారో.. ఇప్పటికీ అదే ఎనర్జీతో ఉన్నారు. సినిమా అంచనాలకు మించి ఉంటుంది’ అన్నారు. దీంతో ప్రేక్షకుల ఆసక్తి రెట్టింపు అయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని