Naga Chaitanya: నాగ చైతన్య రీమేక్ సినిమాపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన టీమ్
‘భూల్ భులయ్యా 2’ను (Bhool Bhulaiyaa 2) నాగ చైతన్య (Naga Chaitanya) రీమేక్ చేయనున్నాడని కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ విషయంపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.
హైదరాబాద్: అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ హీరో ఇటీవల కస్టడీతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. అయితే.. ప్రస్తుతం ఈ హీరో ఓ బాలీవుడ్ సినిమా రీమేక్‌లో నటించనున్నాడనే వార్త సోషల్‌మీడియాలో వైరలవుతోంది. తాజాగా ఈ విషయంపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.
గతేడాది విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘భూల్ భులయ్యా 2’. కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan), కియారా అడ్వాణీ, టబు కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాను నాగచైతన్య తెలుగు, తమిళంలో రీమేక్ చేయనున్నారని టాక్ వినిపించింది. ఇక తెలుగులో టబు పాత్రలో జ్యోతిక (Jyotika)నటించనుందని అన్నారు. ఈ విషయంపై టీమ్ ట్వీట్ చేస్తూ.. ‘‘భూల్ భులయ్యా 2’ (Bhool Bhulaiyaa 2) లో నాగ చైతన్య నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ రూమర్స్‌ను నమ్మొద్దు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ మేము అధికారింగా ప్రకటిస్తాం’’ అని స్పష్టం చేసింది. దీంతో ఈ రూమర్స్‌కు చెక్ పడినట్లైంది.
ఇక ఈ అక్కినేని హీరో తన తర్వాత సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేయనున్నాడు. అయితే దర్శకుడు ఎవరన్న విషయంపై స్పష్టత రాలేదు. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. దీంతో పాటు నాగ చైతన్య తొలి వెబ్ సిరీస్ ‘ధూత’.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Biden-Trump: బైడెన్‌కు దారి దొరకడం లేదు.. అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై ట్రంప్
-
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో 30 టన్నుల వ్యర్థాల తొలగింపు..!
-
KTR: కర్ణాటకలో కాంగ్రెస్ ‘రాజకీయ ఎన్నికల పన్ను’: మంత్రి కేటీఆర్
-
Rohit Shama: సిక్సర్లందు రోహిత్ సిక్సర్లు వేరయా!
-
World Culture Festival : ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ఎంతో ముఖ్యం : జైశంకర్
-
Nara Lokesh: 2 రోజులుకే ఆ పాల ప్యాకెట్లు గ్యాస్ బాంబుల్లా పేలుతున్నాయ్: నారా లోకేశ్