PAPA Review: రివ్యూ: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
నాగశౌర్య - మాళవికా నాయర్ జంటగా నటించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా ఎలా ఉందంటే..?
Phalana Abbayi Phalana Ammayi movie review: చిత్రం: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి; నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్; ఛాయాగ్రహణం: సునీల్ కుమార్ నామ; సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్ (కాఫీఫై సాంగ్); పాటలు: భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ; కూర్పు: కిరణ్ గంటి; కళ: అజ్మత్ అన్సారీ(UK), జాన్ మర్ఫీ(UK), రామకృష్ణ; నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి; సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్; రచన, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల; విడుదల తేదీ: 17-03-2023
నాగశౌర్య (naga shaurya) - శ్రీనివాస్ అవసరాల (srinivas avasarala) కాంబినేషన్లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి గుర్తుండిపోయే సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీరిద్దరూ కలిసి చేసిన మరో సినిమానే.. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi movie review). ఓ జంట జీవితంలోని దశాబ్దకాలంపాటు పలు దశల్ని ఆవిష్కరించే ఈ సినిమా.. కథ రీత్యా చాలా రోజులపాటు చిత్రీకరణ జరుపుకొంది. 2020లోనే మొదలైన ఈ సినిమా దాదాపు రెండేళ్ల తర్వాత పూర్తయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే: సంజయ్ (నాగశౌర్య) (naga shaurya), అనుపమ (మాళవిక నాయర్) (malavika nair) ఒకే కళాశాలలో చదువుకున్నవాళ్లు. అబ్బాయి కంటే అమ్మాయి కాలేజీలో సీనియర్. ర్యాగింగ్ వల్ల వీరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత చదువుకునేందుకని లండన్ వెళతారు. అక్కడ ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత సహజీవనం చేస్తారు. అనుకోని కొన్ని సంఘటనలు వారిని వేరు చేస్తాయి. మళ్లీ ఆ ఇద్దరూ ఎప్పుడు కలుసుకున్నారు? ఎలాంటి విషయాలు వారిద్దరి మధ్య ఎడబాటుకు కారణమయ్యాయనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. (PAPA Review)
ఎలా ఉందంటే: కాలేజీలో పరిచయమైన ఓ జంట పదేళ్ల ప్రయాణమే ఈ కథ. స్నేహంతో మొదలైన ఈ జంట జీవితాన్ని పంచుకునే క్రమంలో ఎలాంటి సంఘర్షణకు గురైందనేది కీలకం. ఇలాంటి సంఘర్షణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. కాస్త అటూ ఇటూగా ఇలాంటి నేపథ్యాన్ని.. ఈ తరహా భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తూ పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘తొలిప్రేమ’ నుంచి మొన్నటి ‘థ్యాంక్యూ’ వరకు చాలా చిత్రాలే గుర్తుకొస్తాయి. ఆ రకంగా చూస్తే ఈ కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. సున్నితమైన కథాంశాలకు పెట్టింది పేరైన శ్రీనివాస్ అవసరాల హాస్యంతోనూ.. మాటల చమక్కులతోనూ వినోదం పంచుతుంటారు. కానీ, ఇది భావోద్వేగాలే ప్రధానంగా సాగే కథ కావడంతో ఆ అవకాశం కూడా దక్కలేదు. ఈ సినిమాను కొత్త పంథాలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఇండీ ఫిలింస్‌ని గుర్తు చేస్తూ సహజత్వానికి పెద్ద పీట వేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో కథనంలో వేగం మందగించింది. ఎక్కడున్న కథ అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రథమార్ధంతో కాలేజీ, స్నేహం, సహజీవనం చుట్టూ సన్నివేశాల్ని మలిచారు దర్శకుడు. ద్వితీయార్ధంలోనే భావోద్వేగాలు పర్వాలేదనిపిస్తాయి. కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్న జంట విడిపోవడం వెనక ఉండే కారణాన్ని బలంగా ఆవిష్కరించడం కీలకం. కానీ, ఈ సినిమాలో ఆ విషయాన్ని ప్రభావవంతంగా ఆవిష్కరించలేకపోయారు దర్శకుడు. కథను ఛాప్టర్ల తరహాలో పలు పార్శ్వాలుగా చెప్పే ప్రయత్నం చేశారు (PAPA Review).
ఎవరెలా చేశారంటే: ప్రేమ కథలకి ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీ కీలకం. ఆ విషయంలో నాగశౌర్య, మాళవిక నాయర్ జోడీ మెప్పిస్తుంది. పదేళ్ల ప్రయాణంలో ఆయా దశలకు తగ్గట్టుగా కనిపించిన తీరు, ఆ సన్నివేశాల్లో ఒదిగిపోయిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాగశౌర్య (Naga Shaurya) పాత్రకు తగ్గట్టుగా తనని తాను మార్చకున్న విధానం, ఆయన కష్టం తెరపై కనిపిస్తుంది. సినిమాలో ప్రధానంగా కనిపించేది ఆ ఇద్దరే. మిగిలిన పాత్రల ప్రాధాన్యం తక్కువే. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సంగీతం, కెమెరా విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. శ్రీనివాస్ అవసరాల ఈ కథని మరీ డాక్యుమెంటరీ తరహాలో నడిపారు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. రచన పరంగా కూడా ఆయన గత సినిమాలతో పోలిస్తే పెద్దగా ప్రభావం చూపించదు. నిర్మాణం బాగుంది.
బలాలు
+ నాగశౌర్య, మాళవిక జోడీ, + ద్వితీయార్ధంలో భావోద్వేగాలు
బలహీనతలు
- సాగదీతగా సన్నివేశాలు - కథ, కథనాల్లో లోపించిన కొత్తదనం
చివరిగా: అబ్బాయి అమ్మాయి మాత్రమే మెప్పిస్తారు..!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆవేశం.. రూ.150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘ఆవేశం’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా?
తాజా వార్తలు (Latest News)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
-
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్‌లు