Nani: తండ్రీకూతుళ్ల కథతో..

కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టిన వేళ నాని ఓ కొత్త కబురు వినిపించారు. ‘దసరా’ సినిమా తర్వాత చేయనున్న కొత్త చిత్రంపై స్పష్టత ఇచ్చారు.

Updated : 02 Jan 2023 07:01 IST

కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టిన వేళ నాని (Nani) ఓ కొత్త కబురు వినిపించారు. ‘దసరా’ సినిమా తర్వాత చేయనున్న కొత్త చిత్రంపై స్పష్టత ఇచ్చారు. ఆయన శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడితో ఓ ప్రాజెక్టు చేయనున్నారు. ఇది నానికి 30వ చిత్రం. చెరుకూరి వెంకట మోహన్‌, విజయేందర్‌రెడ్డి, మూర్తి కలగర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఈ చిత్ర వివరాలతో కూడిన ఓ వీడియోను ఆదివారం విడుదల చేశారు. అందులో నాని ఓ భవనంపై కూర్చొని ఫొటోలు క్లిక్‌ చేస్తూ... తన తదుపరి చిత్ర విషయమై తన ఆన్‌స్క్రీన్‌ కుమార్తెతో చర్చించడాన్ని చూపించారు. దీన్ని బట్టి ఈ సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఓ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇందులో నాని మీసాలు లేకుండా క్లీన్‌ షేవ్‌ లుక్‌తో సరికొత్తగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, కూర్పు: ప్రవీణ్‌ ఆంటోని, ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్గీస్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని