Nawazuddin Siddiqui: అందుకు ఇప్పటికీ గిల్టీగా ఉంది: రజనీకాంత్‌ చిత్రంపై నవాజుద్దీన్ సిద్ధిఖీ

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ ఓ ఇంటర్వ్యూలో పేట చిత్రం గురించి మాట్లాడారు.

Published : 16 Feb 2024 18:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) చిత్రంలో తాను బాగా నటించలేకపోయాననే అపరాధభావం ఇప్పటికీ ఉందని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) అన్నారు. ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆ మూవీ చిత్రీకరణ గురించి మాట్లాడారు. ‘‘పేట (Petta)లో నేనెలా నటించానో నాకే అర్థంకాలేదు. భాష (తమిళ్‌) తెలియకపోవడంతో చాలా విషయాలు గ్రహించలేకపోయా. లిప్‌ సింక్‌తో మేనేజ్‌ చేశా. పెర్ఫామెన్స్‌ బాగా లేకపోయినా పారితోషికం తీసుకున్నందుకు గిల్టీగా ఉంది. ఇలా సైంధవ్‌ విషయంలో జరగకూడదనుకుని అన్నీ నేర్చుకున్నా. నా పాత్రకు సంబంధించిన డైలాగ్ అర్థాలు తెలుసుకుని నేనే డబ్బింగ్‌ చెప్పా’’ అని పేర్కొన్నారు.

మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌‌, బజరంగీ భాయిజాన్‌ వంటి బాలీవుడ్‌ హిట్‌ చిత్రాల్లో భాగమైన నవాజుద్దీన్‌.. పేటతో కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ (Karthik Subbaraj) తెరకెక్కించిన చిత్రమది. 2019లో విడుదలైంది. ఈ డబ్బింగ్‌ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన సైంధవ్‌ (Saindhav)తో బాగా దగ్గరయ్యారు. నేరుగా నటించిన తొలి తెలుగు సినిమా ఇదే. వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా శైలేష్‌ కొలను రూపొందించారు. 2024 సంక్రాంతి కానుకగా రిలీజై, ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. నవాజుద్దీన్‌ హిందీలో మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని