Monica O My Darling Movie review: రివ్యూ: మోనికా ఓ మై డార్లింగ్
రాజ్‌కుమార్‌రావు, హ్యుమాఖురేషి, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించిన మోనికా ఓ మై డార్లింగ్ ఎలా ఉంది?
చిత్రం: మోనికా ఓ మై డార్లింగ్; నటీనటులు: రాజ్‌కుమార్ రావ్, హ్యుమా ఖురేషి, రాధికా ఆప్టే, సికందర్ ఖేర్, సుకాంత్ గోయెల్, ఆకాంక్ష రంజన్ కపూర్, భగవతి పెరుమాళ్, జైన్ మేరీ తదితరులు; సంగీతం: అచింత్ థక్కర్; నిర్మాత: సరితా పాటిల్, సంజయ్ రౌత్రాయ్, విశాల్ బజాజ్; సినిమాటోగ్రఫీ: స్వప్నిల్ సోనావానే, సుఖేష్ విశ్వనాథ్; ఎడిటింగ్: అతాను ముఖర్జీ; దర్శకుడు : వాసన్ బాల; విడుదల:నెట్ ఫ్లిక్స్
ప్రస్తుతం ప్రతి సినిమా థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. కొన్ని చిత్రాలు మాత్రం నేరుగా ఓటీటీవైపే మొగ్గు చూపుతున్నాయి. అలా తాజాగా ఓటీటీలో వచ్చిన చిత్రం ‘మోనికా ఓ మై డార్లింగ్’ రాజ్‌కుమార్ రావ్, హ్యుమాఖురేషి, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? (Monica O My Darling Movie review) క్రైమ్ కామెడీ కథగా తెరకెక్కిన ఈ చిత్రం అలరించిందా?
కథేంటంటే: జయంత్ అర్ఖేద్కర్ (రాజ్‌కుమార్ రావ్) అలియాస్ జై మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ఓ ప్రముఖ రోబొటిక్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. స్వయంకృషితో పైకొచ్చిన అతడి పనిని మెచ్చిన ఆ సంస్థ యజమాని అతడికి కంపెనీలో కీలకపదవి ఇస్తాడు. అంతేకాదు, ఆ కంపెనీ సీఈవో కుమార్తె నిక్కీ (ఆకాంక్ష రంజన్ కపూర్) కూడా జై అంటే ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. జై ఒకవైపు నిక్కీని ప్రేమిస్తూనే మరోవైపు అదే కంపెనీలో పనిచేస్తున్న మోనికాతో సంబంధం పెట్టుకుంటాడు. జై ఆ కంపెనీలో బోర్డు మెంబర్ అయిన తర్వాత మోనికా అతడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడుతుంది. జైతో పాటు అదే కంపెనీలో ఉన్న ఇంకొందరు ప్రముఖులు కూడా ఆమె వలలో పడి, బాధితులవుతారు. జైతో కలిసి మోనికాను చంపాలని ప్లాన్ వేస్తారు? (Monica O My Darling Movie review) మరి వాళ్లు మోనికాను చంపారా? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? వాటి నుంచి జై ఎలా బయటపడ్డాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: ఇదొక నియో-నాయిర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. అంటే, కథా గమనం సమకాలీన పరిస్థితుల్లో జరుగుతూనే అందులోని పాత్రలు, వాటి చిత్రణ డార్క్ థీమ్‌లో సాగుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను సరికొత్త చూపించడంలో దర్శకుడు వాసన్ బాగానే ప్రయత్నించారు. పాత్రల పరిచయం, అసలు కథలోకి తీసుకెళ్లడానికి దర్శకుడు కాస్త సమయం తీసుకున్నాడు. మోనికాను హత్య చేశామని తిరిగొచ్చేసిన జైకు ఊహించని పరిణామం ఎదురవడంతో అసలు కథ కీలక మలుపు తీసుకుంటుంది. అక్కడి నుంచి ప్రతి సన్నివేశం నవ్వులు పూయిస్తూనే ఉత్కంఠగా సాగుతుంది. మోనికాను హత్య చేద్దామనుకుంటే, పరిస్థితులన్నీ తనకు ఎలా వ్యతిరేకంగా మారాయో అతడు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. కంపెనీ సీఈవో కొడుకు, అదే కంపెనీలో పనిచేస్తున్న అకౌంటెంట్‌లు హత్యలకు గురవడం, జైపై కూడా హత్యాయత్నం జరగడంతో తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ప్రేక్షకుడిని వెంటాడుతుంది. (Monica O My Darling Movie review) మరోవైపు పోలీస్ ఆఫీసర్ విజయశాంతి నాయుడు (రాధికా ఆప్టే) ఇన్వెస్టిగేషన్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. మొదటి నుంచి అలరించేలా సాగిన సినిమా.. పతాక సన్నివేశాలకు వచ్చేసరికి చకాచకా చుట్టేసినట్లు అనిపిస్తుంది. అది మినహా సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి మాత్రం ‘మోనికా ఓ మై డార్లింగ్’ మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే: జయంత్ పాత్రలో రాజ్‌కుమార్ రావ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. చాలా సహజంగా నటించాడు. అందరినీ బ్లాక్‌మెయిల్ చేసే పాత్రలో హ్యుమాఖురేషి చక్కగా నటించింది. అలాగే రాధికా ఆప్టే, భగవతి పెరుమాళ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సుకాంత్ గోయెల్ కీలక పాత్రలో కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. నేపథ్య సంగీతం డిఫరెంట్‌గా ఉంది. ఓల్డ్ మెలోడీ థీమ్‌లో సాగే మ్యూజిక్ ఆయా సన్నివేశాలకు కొత్తదనం తెచ్చింది. స్వప్నిల్, సుఖేశ్ సినిమాటోగ్రఫీ సరికొత్తగా ఉంది. థీమ్, లైటింగ్ ఎఫెక్ట్ సినిమాను డిఫరెంట్‌గా చూపించాయి. అతాను ముఖర్జీ ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. వాసన్ బాల డైరెక్షన్ పర్వాలేదు. పతాక సన్నివేశాలను ఇంకాస్త ఆసక్తిగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. (Monica O My Darling Movie review) అయితే, కథ, అందులోని పాత్రలకు తగినట్లు ఆయా సన్నివేశాల్లో వాడిన రిఫరెన్స్‌లు చాలా బాగున్నాయి. ప్రతి డీటెయిల్‌ను వాసన్ చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. మోనికాను చంపేందుకు ప్లాన్ చేసే సమయంలో వాడిన పెయింటింగ్స్, హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు కరెంట్ పోవడం ఇలా సినిమా మొత్తంలో వాడిన రిఫరెన్స్‌లు సినిమాకు కొత్తదనం తెచ్చాయి.
బలాలు
+ రాజ్‌కుమార్ రావ్, హ్యుమాఖురేషి
+ కథాగమనం
+ సాంకేతిక బృందం పనితీరు
బలహీనతలు
- నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు
- క్లైమాక్స్
చివరిగా: క్రైమ్ థ్రిల్లర్ సరికొత్తగా చూడాలా? మోనికా ఓ మై డార్లింగ్..!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers' protest: రెజ్లర్లపై దిల్లీ పోలీసుల తీరు దారుణం.. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే..!
-
Politics News
Chandrababu: ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’.. ఎన్నికల వరాలు ప్రకటించిన చంద్రబాబు
-
General News
TSPSC: రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు
-
India News
Shashi Tharoor: ‘ప్రస్తుత విలువలకు చిహ్నంగా అంగీకరించాలి’.. సెంగోల్‌పై కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
-
Movies News
Hanuman: ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’పై ఉండదు: ప్రశాంత్ వర్మ