Cinema News: అందమైన ప్రేమకథతో..

అఖిల్‌ రాజ్‌, అనన్య జంటగా సూర్య అల్లంకొండ దర్శకత్వంలో ఓ చిత్రం తెర  కెక్కుతోంది. జి.ప్రతాప్‌ రెడ్డి నిర్మాత. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

Updated : 07 Jul 2022 11:51 IST

అఖిల్‌ రాజ్‌, అనన్య జంటగా సూర్య అల్లంకొండ దర్శకత్వంలో ఓ చిత్రం తెర  కెక్కుతోంది. జి.ప్రతాప్‌ రెడ్డి నిర్మాత. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి కాశీ విశ్వనాథ్‌ క్లాప్‌ కొట్టగా.. దగ్గుబాటి అభిరామ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. జి.నాగేశ్వర్‌ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నటి అనన్య మాట్లాడుతూ.. ‘‘ఇదొక మంచి లవ్‌స్టోరీ. ఈ కథపై మేమంతా నమ్మకంగా ఉన్నాం’’ అంది. ‘‘ఇది నా మూడో చిత్రం. యువతరం మెచ్చే ప్రేమకథతో రూపొందుతోంది’’ అన్నారు హీరో అఖిల్‌ రాజ్‌. దర్శకుడు సూర్య మాట్లాడుతూ.. ‘‘అందమైన ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తూర్పు గోదావరి, పల్లమ్‌ వంటి ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. ఆగస్టు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని