First Day First Show: నీ నవ్వే నీ చిరునవ్వే.. నే కోరే వెన్నెల

శ్రీకాంత్‌ రెడ్డి, సంచిత జంటగా వంశీధర్‌ గౌడ్‌, పి.లక్ష్మీనారాయణ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’. శ్రీజ ఏడిద నిర్మాత. శ్రీరామ్‌ ఏడిద సమర్పిస్తున్నారు. దర్శకుడు కె.వి.అనుదీప్‌ కథ అందించారు.

Updated : 27 Jul 2022 10:34 IST

శ్రీకాంత్‌ రెడ్డి (Srikanth Reddy), సంచిత (Sanchita) జంటగా వంశీధర్‌ గౌడ్‌, పి.లక్ష్మీనారాయణ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ (First Day First Show). శ్రీజ ఏడిద నిర్మాత. శ్రీరామ్‌ ఏడిద సమర్పిస్తున్నారు. దర్శకుడు కె.వి.అనుదీప్‌ కథ అందించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం రెండో లిరికల్‌ గీతాన్ని విడుదల చేశారు. ‘‘నీ నవ్వే నీ చిరునవ్వే.. నే కోరే వెన్నెల’’ అంటూ సాగే ఈ పాటకు రథన్‌ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్యశాస్త్రి సాహిత్యమందించారు. రామ్‌ మిర్యాల ఆలపించారు. ‘‘సరికొత్త వినోదాత్మక కథాంశంతో రూపొందిన చిత్రమిది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రవర్గాలు తెలిపాయి. కూర్పు: మాధవ్‌, ఛాయాగ్రహణం: ప్రశాంత్‌ అంకిరెడ్డి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని