Allari Naresh: నాకు అలాంటి కామెడీ ఇష్టం.. అల్లరి నరేశ్‌కి అనిల్ రావిపూడి తోడైతే!
కామెడీకి చిరునామాగా నిలిచే హీరో అల్లరి నరేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి ‘నిజం విత్ స్మిత’ కార్యక్రమంలో సందడి చేశారు. సంబంధిత ప్రోమో బుధవారం విడుదలై, అలరిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘మైఖేల్ మదన కామరాజు’ తరహా కన్ఫ్యూజన్ కామెడీ అంటే తనకు బాగా ఇష్టమని అల్లరి నరేశ్ (Allari Naresh) వెల్లడించారు. ‘నిజం విత్ స్మిత’ (Nijam With Smita) కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో కలిసి వెళ్లిన ఆయన సందడి చేశారు. తన కెరీర్ గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ‘మా బ్యాక్‌డ్రాపే ఫన్’ అంటూ అనిల్ నవ్వులు పూయించారు. మరోవైపు, అదే షోలో పాటల రచయిత అనంత శ్రీరామ్, గాయకుడు రేవంత్ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ నలుగురితో వ్యాఖ్యాత స్మిత ఓ ఆట ఆడించారు. అనంతరం, ఎలాంటి నేపథ్యమున్న కామెడీ అంటే ఇష్టమని స్మిత అడగ్గా.. కన్ఫ్యూజన్ కామెడీ అని నరేశ్, తాను దర్శకత్వం వహించిన ‘ఎఫ్ 2’ చిత్రంలోని పెళ్లిచూపులు సన్నివేశమని అనిల్ తెలిపారు. పూర్తి ఎపిపోడ్ ఓటీటీ ‘సోనీలివ్’ (SonyLiv)లో మార్చి 31న స్ట్రీమింగ్ కానుంది. బుధవారం విడుదలైన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
village backdrop movies: కథ ‘ఊరి’ చుట్టూ.. హిట్ కొట్టేట్టు!
-
Sports News
WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్.. షెడ్యూల్, ప్రైజ్‌మనీ...?
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
WTC Final 2023: అజింక్య రహానే.. ఆ బాధ్యత నీదే: రాహుల్ ద్రవిడ్
-
General News
Kakinada SEZ: కాకినాడ సెజ్‌లో ఎంఐపీ ఏర్పాటుపై ప్రజాగ్రహం
-
Movies News
Naga Chaitanya: నాగ చైతన్య రీమేక్ సినిమాపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన టీమ్