Ramayana: బాలీవుడ్‌ ‘రామాయణం’పై ప్రకటన వచ్చేది అప్పుడే!

అల్లు అరవింద్‌ (Allu Aravind) నిర్మాతగా నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రామయణంపై ఒక అప్‌డేట్‌ వైరల్‌గా మారింది.

Published : 02 Mar 2024 13:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లతో కలిసి అల్లు అరవింద్‌ ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో ఇది రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో సందడి చేయగా.. తాజాగా  మరోసారి ఈ ప్రాజెక్ట్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఏప్రిల్‌లో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా గురించి ప్రకటన రానుందనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఇందులో నటీనటులు ఎవరనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఏప్రిల్‌ 17న ప్రధాన పాత్రలు ఎవరు చేయనున్నారనే విషయాన్ని తెలియజేయనున్నట్లు సమాచారం. సినిమా విడుదల తేదీని  ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మహేశ్‌ బాబును అనుకున్నారు.. తరుణ్‌తో తెరకెక్కించారు!

ఇక ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) , సీతగా సాయి పల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2025 దీపావళికి మొదటి పార్ట్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇక దీని వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌ల కోసం నితేశ్‌ తివారీ టీమ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో సంప్రదింపులు జరిపిందట. ఈ చిత్రం కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగించాలని చిత్రబృందం యోచిస్తోందని అందుకే లుక్‌ టెస్ట్‌ కోసం కూడా త్రీడీ టెక్నాలజీని ఉపయోగించారని టాక్‌ వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని