Updated : 19 May 2022 19:31 IST

NTR 30: ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌.. #ఎన్టీఆర్‌30 అప్‌డేట్‌ వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్‌ (Jr NTR) ఓ చిత్రాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంగీతం ఎవరందిస్తారో, నాయిక ఎవరో? అనుకుంటూ అప్‌డేట్స్‌ కోసం ఎన్టీఆర్‌ అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూశారు. వారి నిరీక్షణకు తాజాగా తెరపడింది. #NTR30 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఆ ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఎన్టీఆర్‌ పుట్టినరోజు (శుక్రవారం) సందర్భంగా చిత్ర బృందం ఈ కానుకను అందించింది. ఈ సినిమా పవర్‌ఫుల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్నట్టు ఈ స్పెషల్‌ వీడియోను చూస్తే అర్థమవుతోంది.

అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి ఉండకూడదని.అప్పుడు భయానికి తెలియాలి తాను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా’ అంటూ ఎన్టీఆర్​ చెప్పిన ​ఫుల్​ డైలాగ్​ అదిరిపోయింది. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు, ఎన్టీఆర్‌ హీరోగా ‘కేజీయఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించనున్న సినిమా అప్‌డేట్‌ శుక్రవారం విడుదలకానుందని సమాచారం.






Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని