NTR: ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ .. తనకూ కావాలని కోరిన తారక్
ఎన్టీఆర్ పిల్లల కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించింది. ఈ ఫొటోను షేర్ చేసిన తారక్ ఆమెకు థ్యాంక్స్ చెప్పాడు.
హైదరాబాద్: ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో సీతగా నటించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను అలరించింది అలియా భట్ (Alia Bhatt). అలాగే ఈ చిత్రంతో తెలుగు వారికి కూడా ఎంతో చేరువైంది. తాజాగా ఈ అమ్మడు ఎన్టీఆర్ (NTR) ఇంటికి ఓ గిఫ్ట్ పంపి తారక్‌ను సర్‌ప్రైజ్ చేసింది. ఎన్టీఆర్ పిల్లల కోసం అందమైన దుస్తులను పంపించిన అలియా.. త్వరలోనే తారక్ కోసం స్పెషల్ అవుట్‌ఫిట్ సిద్ధం చేస్తానని తెలిపింది.
అలియా రెండేళ్ల క్రితం దుస్తులకు సంబంధించిన బిజినెస్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఎన్టీఆర్ కుమారులు అభయ్ రామ్ (Abhay Ram), భార్గవ్ రామ్(Bhargav Ram)ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన డ్రెస్‌లను పంపింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘‘నువ్వు పంపిన ఈ డ్రెస్‌లు పిల్లలకు చాలా నచ్చాయి. వాళ్ల మొహంలో చిరునవ్వులు చూశాను’’అంటూ అలియాకు థ్యాంక్స్ చెప్పిన తారక్.. త్వరలోనే తన పేరు మీద కూడా ఇలాంటి గిఫ్ట్ ఒకటి పంపాలంటూ అలియాను ట్యాగ్ చేశాడు. దీనిపై అలియా స్పందిస్తూ..‘‘నీ కోసం ఈద్ స్పెషల్ అవుట్‌ఫిట్‌ను సిద్ధం చేస్తాను’’ అంటూ ఎన్టీఆర్‌ను స్వీటెస్ట్ అని పేర్కొంది.
అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా అలియా తన ఇన్‌స్టాలో ప్రత్యేక ఇమేజ్‌ను షేర్ చేసింది. సినిమాల విషయానికొస్తే అలియా ప్రస్తుతం ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani) చిత్రంలో నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ తన30వ (#ntr30) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఆయన సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్
-
Social Look: చీరలో పూజా మెరుపులు.. రకుల్ పోజులు.. దివి కవిత్వం ఎవరికోసమో తెలుసా..?
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!