Oy Movie: ‘గుండు.. ఎటు వెళ్లిపోయావ్‌?’: నెటిజన్‌ కామెంట్‌పై ‘ఓయ్‌’ దర్శకుడు ఏమన్నారంటే?

ఓ నెటిజన్‌ ‘గుండు..’ అని కామెంట్‌ చేయగా ‘ఓయ్‌’ సినిమా దర్శకుడు ఆనంద్‌ రంగ స్పందించారు. 

Published : 02 Feb 2024 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో ఏదైనా పోస్ట్‌ పెడితే చాలామంది స్పందిస్తుంటారు. కొందరు పాజిటివ్ కామెంట్లు పెడతారు. ఇంకొందరు ‘దీన్ని చూడరు కదా!’ అనుకుని తమకు ఇష్టమొచ్చింది రాస్తారు. అలా ఓ నెటిజన్‌.. దర్శకుడు ఆనంద్‌ రంగ (anand ranga) పెట్టిన పోస్ట్‌పై కామెంట్‌ చేశారు. ఆయన దాన్ని సరదాగా తీసుకున్నారు. ఏం జరిగిందంటే..?

తాను తెరకెక్కించిన ‘ఓయ్‌’ (Oy Movie) సినిమా ఈ నెల 14న రీ రిలీజ్‌ కానుందని తెలియజేస్తూ ‘ఎక్స్‌’ (ఇంతకు ముందు ట్విటర్‌)లో ఆనంద్‌ పోస్టర్‌ పంచుకున్నారు. ‘మా ఏరియాలోనూ విడుదల చేయండి’ అంటూ సినీ అభిమానులు పలువురు కోరారు. అది డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లో ఉంటుందని డైరెక్టర్‌ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో.. ‘‘గుండు.. ఇలాంటి మంచి సినిమా తీసి ఎటు వెళ్లిపోయావ్‌?’’ అని ఒకరు అడగ్గా.. ఆయన స్మైలీ ఎమోజీ పోస్ట్‌ చేశారు. దర్శకుడి రిప్లైకు షాక్‌ అయిన సదరు నెటిజన్‌.. అలా పిలిచినందుకు సారీ చెప్పారు. ‘ఏం ఫర్వాలేదు. మీరు అన్నది నిజమే’ అని ఆయన పేర్కొన్నారు. ఆనంద్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ దీనికి కారణమైంది. అందులో ఆయన గుండుతో ఉన్నారు.

సిద్ధార్థ్‌, షామిలీ జంటగా నటించిన ఈ సినిమా 2009 జులై 3న విడుదలై అలరించింది. ఆ తర్వాత ఆనంద్‌ మరో సినిమా చేయలేదు. ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేర్‌’, ‘వ్యవస్థ’ తదితర వెబ్‌సిరీస్‌లకు దర్శకత్వం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని