Tollywood: జులై 1న పక్కా కమర్షియల్‌’, ‘రంగరంగ వైభవంగా’

ఈ వేసవిలో విడుదలకావాల్సిన గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’, వైష్ణవ్‌తేజ్‌ ‘రంగరంగ వైభవంగా’ చిత్రాలు వాయిదా పడ్డాయి. కొత్త విడుదల తేదీలను ఆయా చిత్ర బృందాలు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాయి.

Published : 30 Mar 2022 19:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ వేసవిలో సందడి చేయాల్సిన గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’, వైష్ణవ్‌తేజ్‌ ‘రంగరంగ వైభవంగా’ చిత్రాలు వాయిదా పడ్డాయి. కొత్త విడుదల తేదీలను ఆయా చిత్ర బృందాలు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాయి. ఈ రెండు చిత్రాలు జులై 1న బాక్సాఫీసు ముందుకు రానున్నాయి. గోపీచంద్‌, రాశీఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రమే ‘పక్కా కమర్షియల్‌’. యువీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. జాక్స్‌ బెజోయ్‌ సంగీతం అందించారు. ఈ హాస్యభరిత చిత్రంలో గోపీచంద్‌, రాశీఖన్నా లాయర్లుగా కనిపించనున్నారు. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా గిరీశాయ రూపొందించిన చిత్రం ‘రంగరంగ వైభవంగా’. కేతిక శర్మ కథానాయిక. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. ఈ ప్రేమకథా చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మించారు.

విక్రమ్ హక్కులు..

కమల్‌ హాసన్‌ హీరోగా యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్‌’. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకుడు. ఈ చిత్రం జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తమిళనాడుకు సంబంధించిన థియేట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను నటుడు ఉదయనిధి స్టాలిన్‌ దక్కించుకున్నారు. రెడ్‌ గెయింట్‌ మూవీస్‌ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని