Big Boss5: స్పందించిన పాయల్‌ రాజ్‌పూత్‌

తెలుగు బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో పాయల్‌ రాజ్‌పూత్‌ పాల్గొనబోతోందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆ వార్తలకు ఆమె ట్విటర్‌ వేదికగా సమాధానం చెప్పింది. తాను

Updated : 10 Jun 2021 18:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో పాయల్‌ రాజ్‌పూత్‌ పాల్గొనబోతోందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆ వార్తలకు ఆమె ట్విటర్‌ వేదికగా సమాధానం చెప్పింది. తాను తెలుగు బిగ్‌బాస్‌-5లో పాల్గొనడం లేదంటూ స్పష్టం చేసింది. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని.. దయచేసి ఇలాంటి వార్తల్లోకి తనను లాగవద్దని ఆమె కోరింది.

2013లోనే తమిళ చిత్రం ‘ఇరువార్‌ ఉల్లమ్‌’తో ఇండస్ట్రీకి పరిచయమైందీ పంజాబీ గుమ్మ. ‘ఆర్‌ఎక్స్‌100’ బోల్డ్‌ బ్యూటీగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత తెలుగులో వరుస చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ‘సీత’, ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’, ‘వెంకీ మామ, ‘డిస్కోరాజా’, ‘ఏంజిల్‌’ వంటి చిత్రాల్లో నటించిందీ చిన్నది‌. తెలుగుతో పాటు పంజాబీ, హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది. కాగా.. గతేడాది వచ్చిన బిగ్‌బాస్‌4లో ఆమె ఒక ప్రత్యేక గీతానికి చిందులేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని