Unstoppable: రికార్డు సృష్టించిన అన్‌స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్!
ప్రభాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన అన్‌స్టాపబుల్ తాజా ఎపిసోడ్ స్ట్రీమింగ్ విషయంలో రికార్డు సృష్టించినట్లు ఆహా తెలిపింది.
హైదరాబాద్: బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ (Unstoppable). ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ కార్యక్రమం సీజన్-2లో ఓ ఎపిసోడ్ రికార్డు సృష్టించింది. అగ్ర కథానాయకుడు ప్రభాస్ (Prabhas) పాల్గొన్న ఎపిసోడ్‌ను ఆహా ఇటీవల స్ట్రీమింగ్కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు ఆహా తెలిపింది. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులకు, ఆహా సబ్స్క్రైబర్లకు ధన్యవాదాలు తెలిపింది.
ప్రభాస్‌తో బాలకృష్ణ ఇంటర్వ్యూ అని ప్రకటించగానే ఈ ఎపిసోడ్‌కు మంచి హైప్ వచ్చింది. అభిమానుల కోసం కాస్త ముందుగానే గురువారం రాత్రి 9గంటల నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. అయితే, ఒక్కసారిగా ఆహా యాప్‌నకు వీక్షకులు పోటెత్తడంతో ప్రభాస్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. సాంకేతిక సమస్య పరిష్కారమయ్యాక ఎపిసోడ్ అందుబాటులో వచ్చింది. తన సినిమాలతో పాటు, తనపై వస్తున్న గాసిప్స్పైనా ప్రభాస్ ఈ సందర్భంగా స్పందించారు. ఇక ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. రెండో భాగంలో మరో నటుడు గోపిచంద్ కూడా పాల్గొంటారు. వచ్చే శుక్రవారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha: ఏఎస్సై కాల్పుల ఘటన.. తూటా గాయాలతో ఒడిశా ఆరోగ్య మంత్రి కన్నుమూత
-
World News
Pakistan: పౌరులకు పాకిస్థాన్ షాక్.. పెట్రోల్‌పై ఒకేసారి రూ.35 పెంపు!
-
Sports News
U 19 World Cup: అండర్ - 19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా టీమ్ఇండియా
-
General News
Ts News: గుజరాత్లో పంచాయతీ సర్వీస్ పరీక్ష పేపర్ లీక్.. హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్టు
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Babar: విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్