Hanuman: మమ్మల్ని అర్థం చేసుకోండి.. ‘హనుమాన్‌’ ఓటీటీ రిలీజ్‌పై దర్శకుడి పోస్ట్‌

‘హనుమాన్‌’ ఓటీటీ రిలీజ్‌ కోసం ఎదురుచూసే వారికి మరోసారి నిరాశ ఎదురైంది. 

Published : 15 Mar 2024 10:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్‌’ (Hanuman). ఇది ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. చిత్రబృందం మాత్రం దీని విడుదలపై స్పష్టతనివ్వకుండా ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతోంది.

‘‘హనుమాన్‌’ ఓటీటీ విడుదల ఆలస్యమవుతోంది. ఉద్దేశపూర్వకంగా చేస్తోంది కాదు. వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి మా టీమ్ అవిశ్రాంతంగా పనిచేస్తోంది. మీకు ఉత్తమమైనది అందిచాలన్నదే మా ఉద్దేశం. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మాకు సపోర్ట్‌ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ అని ప్రశాంత్‌ వర్మ మరో పోస్ట్‌ పెట్టారు. దీనిపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘కనీసం అంచనా తేదీనైనా ప్రకటించండి’ అని కామెంట్స్‌ పెడుతున్నారు.

రివ్యూ: ర‌జాకార్‌.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?

తొలుత ఇది మార్చి 2 నుంచి ‘జీ5’లో స్ట్రీమింగ్‌ అవుతుందని టాక్ వినిపించింది. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రసారం కానుందని  ప్రచారం జరిగింది.  తాజాగా మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు దర్శనమిచ్చాయి. ఇప్పుడు ప్రశాంత్ వర్మ పోస్ట్‌తో అభిమానులు నిరాశకు గురయ్యారు. తేజ సజ్జా (Teja sajja) హనుమంతుగా మెప్పించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar), అమృత అయ్యర్‌, సముద్రఖని, వినయ్‌రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను తదితరులు నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని