Salaar: ‘సలార్‌’ కోసం పృథ్వీరాజ్‌ చేసినట్లు దేశంలో ఏ హీరో చేయలేడు..: ప్రశాంత్ నీల్‌

పృథ్వీరాజ్‌ పై ‘సలార్‌’ (Salaar) దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన ఈ చిత్రం కోసం చాలా కష్టపడినట్లు చెప్పారు.

Published : 22 Dec 2023 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘సలార్’ (Salaar) ట్రెండ్ కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, పృథ్వీరాజ్ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై అద్భుత స్పందన సొంతం చేసుకుంది. ఇక ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) గురించి చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా ట్రెండ్‌ అవుతున్నాయి.

ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో వ‌ర‌ద రాజమ‌న్నార్ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన గురించి ప్రశాంత్‌ నీల్ మాట్లాడుతూ.. ‘‘సలార్‌’లో నటించడానికి పృథ్వీరాజ్‌ అంగీకరించడం చాలా గొప్ప విషయం. సినిమాపై అమితమైన ప్రేమ ఉంది కాబట్టే ఆయన కథ చెప్పగానే ఓకే అన్నారు. నేను సినిమాను ఎంత అభిమానిస్తానో పృథ్వీరాజ్‌ కూడా అలానే ఆరాధిస్తారు. ఆయన ఈ చిత్రానికి చేసినంతగా దేశంలో మరేనటుడు చేయలేరని నేను పూర్తి నమ్మకంతో చెప్పగలను. నేను, ప్రభాస్‌, పృథ్వీరాజ్ ఓ టీమ్‌లా పనిచేశాం. పరస్పరం ఆలోచనలను పంచుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని చర్చించుకున్నాం. సన్నివేశం బాగా వచ్చిందని నేను చెప్పే వరకు వాళ్లు చేస్తూనే ఉండేవాళ్లు. వాళ్లిద్దరూ దర్శకుడి దృష్టికోణంలోనూ ఆలోచిస్తారు. వాళ్లు అలా ఆలోచించారు కాబట్టే సినిమా అవుట్‌పుట్‌ ఇంత బాగా వచ్చింది’’ అని ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel)చెప్పారు.

ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌.. ‘2018’కి దక్కని చోటు

డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్‌’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఎన్నో రోజులుగా హిట్‌ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్‌ (Prabhas) అభిమానులతో పాటు యాక్షన్ ప్రియులను కూడా ఇది మెప్పిస్తోంది. దీంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డులు సృష్టించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సొంతం చేసుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు