Priyamani: వారు చెప్పిన మాటలు ఎంతో ఉపయోగపడతాయి: ప్రియమణి

ప్రియమణి కీలక పాత్రలో నటించిన ఆర్టికల్‌ 370 ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.

Published : 17 Feb 2024 15:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి ప్రియమణి (Priyamani) ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌ ’(chennai express) సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించి బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’(Jawan) చిత్రంలోనూ అలరించారు.  తాజాగా ఆమె కీలకపాత్రలో నటించిన ‘ఆర్టికల్‌ 370’(Article 370) విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుక్‌ఖాన్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌ గురించి మాట్లాడారు. ‘‘షారుక్‌ ఖాన్‌ను ద్వేషించేవారి కంటే ప్రేమించేవారే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆయన మంచి మనసు, వ్యక్తిత్వం ఉన్నవారు. నా జీవితంలో పరిచయమైన గొప్ప వ్యక్తుల్లో ఒకరు. అందరినీ ఒకేలా గౌరవిస్తారు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌ షూటింగ్‌ సమయంలో ఈ పరిశ్రమలో కొనసాగాలంటే ఎలాంటి ఆలోచనలు కలిగిఉండాలి అన్నది తెలియజేశారు. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా.  ఎస్‌ఆర్‌కే, రోహిత్‌శెట్టి నా డ్యాన్స్‌ చూసి కిందకి వచ్చి కలవమని కూడా చెప్పారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’లో మనోజ్‌ బాజ్‌పాయ్‌తో కలిసి నటించాను. ఆయన చాలా స్పాంటేనియస్‌గా ఆలోచిస్తారు.  ప్రతి సీన్‌ దర్శకుడు కోరుకునేలా చాలా పర్‌ఫెక్ట్‌గా చేస్తారు. ఆయనతో కలిసి వర్క్‌ చేయడం బాగుంది. ఎన్నో కొత్త విషయాలు అనుభవంలోకి వచ్చాయి.  హిందీలోనే కాదు, సౌత్‌లోనూ సినిమాలు చేసేటప్పుడు మనోజ్‌ చెప్పిన మాటలు ఉపయోగపడతాయి’’ అని ఆమె తెలిపారు.

ఆర్టికల్‌ 370 సినిమా విషయానికి వస్తే యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రలో ఆదిత్య సుహాస్‌ దీనిని తెరకెక్కించారు. కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఈనెల 28న విడుదల కానుంది. మరోవైపు  ప్రియమణి మెయిన్‌ లీడ్‌గా నటించిన ‘భామాకలాపం 2’ ‘ఆహా’ వేదికగా ఈనెల 16న విడుదలై, స్ట్రీమింగ్‌ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని