Tollywood: ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌తో ‘మా’ భేటీ.. చర్చించిన అంశాలివీ

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యలపై ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌తో మూవీ ఆర్టిస్ట్స్‌  (మా) అసోసియేషన్‌ బుధవారం భేటీ అయ్యింది.

Published : 04 Aug 2022 01:23 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యలపై ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌తో (Active Telugu Film Producers Gild) మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) (Movie Artists Association) బుధవారం భేటీ అయ్యింది. సినిమా చిత్రీకరణల్లో వృథా ఖర్చులు, స్థానిక ప్రతిభను వినియోగించుకోవటం, ఇతర చిత్ర పరిశ్రమల నటులకు మెంబర్‌ షిప్‌ ఇవ్వడం, నటుల రెమ్యూనరేషన్‌ తదితర అంశాలపై చర్చ సాగినట్టు సమాచారం. తుది నిర్ణయం కోసం గిల్డ్‌, మా.. మరోసారి సమావేశం కానున్నాయి.  మంచు విష్ణు, రఘుబాబు, శివబాలాజీ, దిల్‌ రాజ్‌, శరత్‌ మరార్‌, బాపినీడు, జీవితా రాజశేఖర్‌ తదితరులు హాజరయ్యారు.

థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం, కొత్త సినిమాలు త్వరగా ఓటీటీలో విడుదలకావటం, టికెట్‌ ధరలు పెరగడం... ఇలా పలు సమస్యలకు పరిష్కారం దిశగా నిర్మాతలంతా ఆగస్టు 1 నుంచి షూటింగ్స్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. అన్నింటికీ పరిష్కారం లభించాకే చిత్రీకరణలు కొనసాగించాలని నిర్ణయించారు. ఆ మేరకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అన్ని కోణాల్లోనూ చర్చిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని