Puri Musings: ఆ దేశాల్లో పుడితే ఆందోళన ఉండదు
కామన్వెల్త్ దేశాల్లో పుట్టినా, అక్కడి సిటిజన్‌షిప్ ఉన్నా పిల్లలు, ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన ఉండదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ దేశాల్లో పుట్టినా.. అక్కడి సిటిజన్‌షిప్ ఉన్నా.. పిల్లలు, ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన ఉండదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. పూరీ మ్యూజింగ్స్ వేదికగా తాజాగా ఆయన ‘నేషనల్ హెల్త్‌కేర్ సిస్టమ్’ గురించి ముచ్చటించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే... ‘మనందరం రాత్రి, పగలు కష్టపడి ఆస్తులు కూడబెట్టేది పిల్లల చదువుల కోసం. అనారోగ్య సమస్యలకి, సొంత ఇంటికి, వృద్ధాప్యం కోసం దాచుకుంటాం. అయితే వీటన్నిటి కోసం ఎంత డబ్బు కావాలో తెలీదు. దాని పరిమితీ మనకు తెలియదు. యూరప్, కెనడా, ఆస్ట్రేలియా తదితర కామన్వెల్త్ దేశాల్లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. పిల్లలందరికీ బేసిక్ ఎడ్యుకేషన్ ఉచితం. పై చదువులు చదవాలంటే ప్రభుత్వం నుంచి లోన్ తీసుకుని, ఉద్యోగం వచ్చాక మెల్లగా తీర్చాలి. స్కాట్లాండ్లో అయితే ఎంత చదివినా, ఎన్నేళ్లు చదివినా అది పూర్తిగా ఉచితమే’.
ఆరోగ్య బీమా విషయానికొస్తే ఆయా దేశాల్లో నేషనల్ హెల్త్ కేర్ సిస్టమ్.. ఇది ప్రపంచలోనే నంబరు 1. ప్రతి సిటిజన్‌కి ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఉంటాడు. తనకి రోగి గురించి అంతా తెలుసు. మన హెల్త్ రికార్డు అతడి దగ్గర ఉంటుంది. ఒకవేళ వేరే ఊరిలో ఉండి ఆసుపత్రిలో చేరితే మీ ప్రైమరీ డాక్టర్ నుంచి రిపోర్టు తీసుకుని వాళ్లే చికిత్స అందిస్తారు. నీ గురించి నువ్వు వాళ్లకి చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ కాలు విరిగితే అందులో చికిత్స ఉచితం. అంతేకాదు ఉదయమే 5 స్టార్ మెనూ కార్డు ఇస్తారు. ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. అదీ ఉచితమే. డిశ్చార్జ్ అయ్యాక కూడా ఓ బృందాన్ని పంపిస్తారు. వాళ్లే వండిపెడతారు. మందులు సరిగా వేసుకుంటున్నావో లేదో చూస్తారు. వారానికోసారి షాపింగ్ కూడా చేసి పెడతారు. జీవితాంతం బెడ్ మీదే ఉండాల్సిన పరిస్థితి వస్తే నెలకు రూ.3 లక్షలు ఖర్చు పెడతారు. చివరి వరకు చూసుకుంటారు. దాన్ని రెసిడెన్షియల్ కేర్ అంటారు. ఒక సిటిజన్ హెల్త్ కేర్ కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లైనా ఖర్చుపెడుతుంది. ఈ దేశాల్లో పుట్టినా అక్కడి సిటిజన్ షిప్ ఉన్నా పిల్లలు, ఆరోగ్యం గురించి ఆందోళన ఉండదు. భవిష్యత్ మీద భయంతో రకరకాల తప్పులు చేస్తూ డబ్బు సంపాదించే అవసరం కూడా ఉండదు. మనశ్శాంతిగా బతకొచ్చు. అలాంటి హెల్త్ కేర్ సిస్టమ్ మన ఇండియాలో కూడా రావాలని కోరుకుందాం’ అని అన్నారు పూరీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్