Pushpa The Rule: పుష్పరాజ్‌ చిటికెన వేలు గోరు ఎందుకు హైలైట్‌ చేస్తున్నారు? కారణం అదేనా?

Pushpa The Rule: అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప2’ సినిమా రిలీజ్‌ డేట్‌ను తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలో విడుదల చేసిన పోస్టర్‌పై ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Updated : 12 Sep 2023 22:43 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa The Rule). 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్‌’కు సీక్వెల్‌గా దీన్ని తీసుకొస్తున్నారు. తొలి భాగం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ‘పుష్ప2’ ఆ అంచనాలను అందుకునేలా తీర్చిదిద్దుతున్నారు.  వచ్చే ఏడాది ఆగస్టు 15న ‘పుష్ప2’ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రిలీజ్‌ డేట్ ప్రకటిస్తూ పంచుకున్న పోస్టర్‌లో  అల్లు అర్జున్‌ చేతిని చూపిస్తూ, అందులో చిటికెన వేలు గోరును హైలైట్‌ చేసింది చిత్ర బృందం. కొన్ని రోజుల కిందట ‘వేర్‌ ఈజ్‌ పుష్ప’ పేరుతో విడుదల చేసిన వీడియోలోనూ అదే గోరును హైలైట్‌ చేశారు. అయితే అప్పట్లో దాని గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా దీనిపైనే చర్చ జరుగుతోంది.

ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు భాషల్లో రీమేక్‌ చేశారు!

ఇలా కేవలం చిటికెన వేలు గోరును ప్రత్యేకంగా చూపించడం వెనుక ఓ థియరీ ఉందని చెబుతున్నారు. అదేంటంటే, కొన్ని సంస్కృతుల్లో తమ సంపదను, సమాజంలో స్థాయిని చూపించేందుకు చిటికెన వేలు గోరు పెంచుకుంటారట. అంతేకాదు, కేవలం రూల్ చేయడానికి మాత్రమే తాము ఉన్నట్లు గుర్తుగా చూపించడానికి కూడా పెంచుతారని అంటున్నారు. ఇక ఎర్ర చందనం వ్యాపారాన్ని చిటికెన వేలుపై నిలబెట్టి చేయడగలడని సూచనగా దాన్ని హైలైట్‌ చేస్తున్నట్టు టాక్‌. సుకుమార్‌ తీసే ప్రతి షాట్‌ విషయంలోనూ కొన్ని రిఫరెన్స్‌లు ఉంటాయి. అవేంటో స్వయంగా ఆయనే చెబితేనే తెలుస్తుంది. గతంలో ‘రంగస్థలం’లో జగపతిబాబు పాత్రకు పామును రిఫరెన్స్‌గా తీసుకున్నారు. పామును ఏ విధంగానైతే కొట్టి చంపుతారో అలాగే ఫణీంద్రభూపతి (జగపతిబాబు)ని కూడా చిట్టిబాబు (రామ్‌చరణ్‌) కొట్టి చంపుతాడు. మరి ఇప్పుడు అల్లు అర్జున్‌ గోరును హైలైట్‌ చేయడం వెనుక ఏముందో చూడాలి.

జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌  (Allu Arjun) ‘పుష్ప2’ కోసం మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మరోవైపు దేవిశ్రీకి కూడా జాతీయ అవార్డు రావడంతో ‘పుష్ప1’ను మించేలా పాటలను స్వరపరుస్తున్నట్లు టాక్‌. రష్మిక కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని