Raashikhanna: కాజల్‌ నివాసంలో రాశీఖన్నా సందడి.. ఫొటోలు వైరల్‌

నటి రాశీఖన్నా.. కాజల్‌ నివాసానికి వెళ్లారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

Published : 14 Oct 2023 20:47 IST

ముంబయి: కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) నివాసంలో నటి రాశీఖన్నా (Raashii Khann) సందడి చేశారు. వీకెండ్‌లో భాగంగా శనివారం సాయంత్రం ముంబయిలోని కాజల్‌ ఇంటికి ఆమె వెళ్లారు. దీంతో వీరిద్దరూ క్వాలిటీ సమయాన్ని ఎంజాయ్‌ చేశారు. కాజల్‌ తనయుడు నీల్‌తో రాశీ సరదాగా ఆటలు ఆడారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను రాశీ ఖన్నా తాజాగా నెట్టింట షేర్‌ చేశారు. ‘‘ఈరోజు నేను ఎంతో ఆనందంగా ఉన్నా. నీల్‌ని కలిసినందుకు సంతోషంగా అనిపిస్తుంది’’ అని ఆమె పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

వీరిద్దరూ కలిసి ఏ ప్రాజెక్టూ చేయనప్పటికీ.. దక్షిణాది చిత్రాల్లో నటిస్తోన్న సమయంలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది. ప్రస్తుతం కాజల్‌.. ‘భగవంత్‌ కేసరి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, రాశీ ఖన్నా నటించిన ‘యోధ’ నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. తన తదుపరి ప్రాజెక్ట్‌ల కోసం ముంబయిలో ఉన్న ఆమె.. కాజల్‌ నివాసానికి వెళ్లారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని