Rahul Ramakrishna: త్వరలో రాహుల్‌ రామకృష్ణ వివాహం.. జీవిత భాగస్వామిని పరిచయం చేసిన నటుడు

కమెడియన్‌, సహాయనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్‌ రామకృష్ణ. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో ఫేమ్‌ సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు...

Published : 08 May 2022 10:08 IST

హైదరాబాద్‌: కమెడియన్‌, సహాయనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్‌ రామకృష్ణ. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో ఫేమ్‌ సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్‌ తాజాగా ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. త్వరలో తాను పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. తన జీవితభాగస్వామిని పరిచయం చేస్తూ ఆదివారం ట్విటర్‌ వేదికగా ఓ ఫొటో షేర్‌ చేశారు. ‘‘ఎట్టకేలకు, త్వరలో పెళ్లి చేసుకోనున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే తన జీవిత భాగస్వామికి సంబంధించిన ఎలాంటి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇక, ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ కంగ్రాట్స్‌ చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రాహుల్‌ ఓ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని