rajaakar: అంతా ఏకమవ్వాలనే ‘రజాకార్‌’ నిర్మించా

‘‘చరిత్ర ఏ రూపంలోనైనా ఉండొచ్చు. మేం సినిమా రూపంలో చరిత్రని చెప్పాం. నాడు జరిగిన విషయాల్ని నేటి సమాజం కళ్లముందుకు తీసుకొచ్చి... జాగ్రత్త పడాలని చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు గూడూరు నారాయణరెడ్డి.

Updated : 13 Mar 2024 10:11 IST

‘‘చరిత్ర ఏ రూపంలోనైనా ఉండొచ్చు. మేం సినిమా రూపంలో చరిత్రని చెప్పాం. నాడు జరిగిన విషయాల్ని నేటి సమాజం కళ్లముందుకు తీసుకొచ్చి... జాగ్రత్త పడాలని చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు గూడూరు నారాయణరెడ్డి. ఆయన నిర్మించిన చిత్రం ‘రజాకార్‌’. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్‌ దేశ్‌పాండే ప్రధాన పాత్రలు పోషించారు. యాటా సత్యనారాయణ దర్శకుడు. ఈ నెల 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ. మరాఠీ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత గూడూరు నారాయణరెడ్డి హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.

  • ‘ఏడో నిజాం పాలనలో నైజాం ప్రాంతంలో జరిగిన ఆకృత్యాల్ని కళ్లకు కట్టే ప్రయత్నమే ‘రజాకార్‌’. హత్యలు, అత్యాచారాలు, బలవంతపు మత మార్పిడులతో కూడిన ఆ అమానుషం గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందనే ఈ సినిమా తీశాం. అప్పట్లో జరిగిన అన్యాయాలు పునరావృత్తం కాకుండా అంతా ఏకం కావాలని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా’’.
  • ‘‘గొప్ప భావోద్వేగాలతో... రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది కథ.నటులు ప్రతి పాత్రకీ న్యాయం చేశారు. పాటలు కంటతడి పెట్టిస్తాయి. ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. భవిష్యత్తులో నిర్మాతగానే, సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమాలు తీస్తా’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని