Rajamouli: ఆమిర్‌ఖాన్.. మా అగ్రిమెంట్‌ని బ్రేక్ చేశారు: రాజమౌళి
ఆర్ఆర్ఆర్ ప్రెస్‌మీట్
‘ఆర్ఆర్ఆర్’ @ వెయ్యి కోట్లు.. టీమ్ ప్రెస్‌మీట్
ముంబయి: తమ మధ్య ఉన్న అగ్రిమెంట్‌ను బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ బ్రేక్ చేశారని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లు రాబట్టిన నేపథ్యంలో బుధవారం ముంబయిలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్, కరణ్ జోహార్ తదితరులు ఈ పార్టీలో పాల్గొని.. రాజమౌళి వర్కింగ్ స్టైల్‌ని కొనియాడారు. ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా ఆమిర్ మాట్లాడుతూ.. ‘‘సినిమా విడుదలకు ముందు చిత్రబృందం ఎంతటి ఒత్తిడికి గురవుతుందో నాకు తెలుసు. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత రాజమౌళి గారు, ఆయన టీమ్ మొత్తం ఎంతో ఆనందంగా ఉంది. రాజమౌళి.. ఇలాగే అద్భుతమైన విజయాలు అందుకోవాలని, మంచి సినిమాలతో మమ్మల్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా’’ అని ఆమిర్ తెలిపారు. ‘‘ఆమిర్‌ఖాన్, నాకు మధ్య ఒక ఒప్పందం ఉంది. కేవలం పేర్లు పెట్టి మాత్రమే పిలుచుకోవాలని, సర్, గారు, అనే పదాలు ఉపయోగించుకోకూడదని ఇటీవల మా మధ్య ఓ అగ్రిమెంట్ పెట్టుకున్నాం. ఆయన్ని సర్ అని కాకుండా ‘ఏకే’ పిలవడానికి నేను ఇబ్బందిపడ్డాను. ఆమిర్ ఒత్తిడి చేయడంతోనే నేను ఆయన్ని ‘ఏకే’ అని పిలువగలిగాను. కానీ, ఇప్పుడు ఆయన మా మధ్య ఉన్న అగ్రిమెంట్‌ను బ్రేక్ చేసి నన్ను రాజాజీ అని పిలుస్తున్నారు(నవ్వులు)’’ అని రాజమౌళి అన్నారు. ఈ సక్సెస్‌మీట్‌లో చిత్రబృందం పంచుకున్న విశేషాలివే..
ఒక సినిమా కోసం మూడు లేదా నాలుగేళ్లు కేటాయించాల్సి వస్తే ఒకేనా?
తారక్, చరణ్: తప్పకుండా మంచి కథ ఉండి, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే కచ్చితంగా అంతకాలం సమయం ఇస్తాం.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత స్టార్డమ్ మరింత పెరిగిందనుకుంటున్నారా?
చరణ్: నా దృష్టిలో స్టార్డమ్ అంటే ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేవడం, 7 గంటలకల్లా సెట్లోకి అడుగుపెట్టడం, 7.30కి ఫస్ట్ షాట్ కంప్లీట్ చేయడం, సాయంత్రం ఇంటికి వచ్చాక ఫ్యామిలీతో సమయం గడపటం, జిమ్, డిన్నర్, నిద్ర.. దీన్నే ప్రతి రోజూ ఫాలో కావడం. ప్రతిరోజూ ఇదే పనిచేయడం బోరింగ్‌గా ఉండొచ్చు. కానీ, ఒక నటుడిగా మనమెప్పుడూ క్రమశిక్షణతో ఉండాలి. అదే మనకు స్టార్డమ్ తెచ్చిపెడుతుంది. అలా వచ్చిన స్టార్‌డమ్‌ని మరలా క్రమశిక్షణతోనే కాపాడుకోవాలి.
తారక్: చరణ్ ఏదైతే చెప్పాడో అది పూర్తిగా నిజం.
ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశాలు?
చరణ్: ఇంటర్వెల్ పార్ట్ నాకు బాగా ఇష్టం. రామ్-భీమ్ల మధ్య వచ్చే మనస్పర్థలు.. ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్ నాకెంతో నచ్చేశాయి.
తారక్: నాకు కూడా అదే సీన్లు ఇష్టం.
రాజమౌళి సర్.. మిమ్మల్ని అత్యద్భుతమైన స్టోరీ టెల్లర్ అని పిలవచ్చా?
రాజమౌళి: మీకు నా సినిమాలు నచ్చినంత వరకూ మీరు నన్ను ఎలా పిలిచినా ఆనందిస్తాను.
‘బాహుబలి’, లేదా ‘ఆర్ఆర్ఆర్’.. ఏ సినిమా మీ హృదయానికి దగ్గరైంది?
రాజమౌళి: ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం నేను ‘ఆర్ఆర్ఆర్’కి ఎంతో దగ్గరయ్యాను. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలను పోల్చి చూసినా, నా ఫిల్మోగ్రఫీ మొత్తంలో నాకిష్టమైన చిత్రాన్ని చెప్పమని కోరినా ప్రస్తుతానికి ‘ఆర్ఆర్ఆర్’ అనే చెబుతా. ఎందుకంటే నేను భావోద్వేగ పరంగా ఆ చిత్రానికి కనెక్ట్ అయిపోయాను. సుమారు 8 నెలల తర్వాత మీరు నన్ను ఇదే ప్రశ్న అడిగితే అప్పుడు నేను సరైన సమాధానం చెప్పగలనేమో.
కొరటాల శివ ప్రాజెక్ట్ గురించి ఏమైనా చెప్పగలరు?
తారక్: నా తదుపరి ప్రాజెక్ట్ కొరటాల శివతోనే. ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. త్వరలోనే వివరాలు చెబుతా
రామ్‌చరణ్‌కు ఎక్కువ ప్రశంసలు లభిస్తున్నాయి కదా?
రామ్‌చరణ్: ఆ మాటను నేను ఏకీభవించను. ఒక్కక్షణం కూడా నేను దాన్ని నమ్మను. మేమిద్దరం చాలా బాగా నటించాం. ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడు. ఇప్పటివరకూ ఏ చిత్రానికి చేయనంత ఎంజాయ్మెంట్ ఈ సినిమా చేసేటప్పుడు ఫీలయ్యాను. తారక్‌తో నా ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశాన్ని కల్పించిన రాజమౌళికి థ్యాంక్స్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా లెక్కల మాస్టర్‌కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్‌కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్‌కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్‌లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్‌తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్‌ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్‌కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్‌కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!