lal salaam: మానవత్వాన్ని పంచుకో..

‘‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో. మానవత్వాన్ని అందరితో పంచుకో. భారతీయుడిగా నేర్చుకోవల్సింది అదే’’ అంటున్నారు రజనీకాంత్‌. మొయిద్దీన్‌ భాయ్‌ పాత్రలో ఆయన చేసిన సందడి ఎలాంటిదో తెలియాలంటే ‘లాల్‌ సలామ్‌’ చూడాల్సిందే.

Updated : 08 Feb 2024 09:50 IST

‘‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో. మానవత్వాన్ని అందరితో పంచుకో. భారతీయుడిగా నేర్చుకోవల్సింది అదే’’ అంటున్నారు రజనీకాంత్‌. మొయిద్దీన్‌ భాయ్‌ పాత్రలో ఆయన చేసిన సందడి ఎలాంటిదో తెలియాలంటే ‘లాల్‌ సలామ్‌’ చూడాల్సిందే. రజనీకాంత్‌ ప్రధాన పాత్రధారిగా... ఆయన తనయ ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్‌ సలామ్‌’. విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్‌, కపిల్‌దేవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుభాస్కరన్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్‌ సంస్థ విడుదల చేస్తోంది. బుధవారం ట్రైలర్‌ని విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని