Rakul Preet: నేను నటించగలనని అమ్మ నమ్మింది : రకుల్‌ ప్రీత్‌

బాలీవుడ్‌ నటి రకుల్‌ ప్రీత్‌ తన తల్లిదండ్రులను ప్రశంసిస్తూ మాట్లాడారు.

Updated : 09 Mar 2024 14:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రకుల్‌ ప్రీత్‌ (Rakul Preet ). ‘గిల్లీ’ కన్నడ మూవీతో తెరంగేట్రం చేసి అనంతరం హిందీ పరిశ్రమలో ఇటీవల దశాబ్దకాలం పూర్తి చేసుకున్నారు. తాజాగా ఓ మీడియా సంస్థతో తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం గురించి మాట్లాడారు. ‘‘మా అమ్మ, నాన్నల ప్రోత్సాహమే ఈ స్థాయిలో నిలబెట్టింది. నా ప్రతిభను గుర్తించి, నేను నటించగలనని నమ్మింది మా అమ్మ. అందుకే కుటుంబ నేపథ్యం వేరైనా పరిశ్రమలో అడుగుపెట్టేందుకు ఎవరినీ ఒప్పించవలసిన అవసరం రాలేదు. మా నాన్న ఎంతో సపోర్ట్‌ చేశారు. వారు ఎప్పుడూ అమ్మాయి, అబ్బాయి అనే భేదం చూపించలేదు. మీరు ఏం చేయాలనుకున్నా చేయండి, అందులో విజయం సాధించండి అని చెప్పేవారు. టేబుల్‌ టెన్నిస్‌, స్విమ్మింగ్‌, గోల్ఫ్‌ వంటి స్పోర్ట్‌ కూడా నేర్పించారు. తల్లిదండ్రుల సపోర్ట్‌తో పాటు కష్ట పడితే ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చు. ’’ అని రకుల్‌ పేర్కొన్నారు.

అస్సాం వేదికగా జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న రకుల్‌ తన భర్త జాకీ భగ్నానీ పై ప్రశంసలు కురిపించారు. ‘‘జాకీ మంచి మనసు, హాస్య చతురత కలిగిన వ్యక్తి, అతడిలో కామెడీ టైమింగ్‌ నన్ను ఆకర్షించింది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. చుట్టూ ఉన్న వాళ్లు సంతోషంగా ఉండేలా చూస్తాడు’’ అని ఆమె అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని