Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్‌లో సెలబ్రేషన్స్‌.. ఫొటోలు వైరల్‌

‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సెట్‌లో తాజాగా వేడుకలు జరిగాయి. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Updated : 17 Aug 2023 13:28 IST

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ (Ram Charan) నటిస్తోన్న భారీ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ప్రముఖ దర్శకుడు శంకర్‌ (Shankar) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గురువారం శంకర్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా సెట్‌లో సెలబ్రేషన్స్‌ జరిగాయి. రామ్‌చరణ్‌, దిల్‌రాజు ఈ వేడుకల్లో పాల్గొని ఆయనకు విషెస్‌ తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. శంకర్‌ బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన ఫిల్మ్‌ మేకింగ్‌ స్టైల్‌ను కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు.

పవన్‌ గురించి రెండు సందర్భాల్లోనూ నిజమే చెప్పా: రేణూ దేశాయ్‌

‘రోబో 2.0’ తర్వాత ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘ఇండియన్‌ 2’ చిత్రాలకు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ విషయానికి వస్తే.. ఇదొక పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా సిద్ధమవుతోంది. రామ్‌చరణ్‌ ఇందులో రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని టాక్‌. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌, సముద్రఖని, నవీన్‌ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని