Kiara-Sidharth: కియారా- సిద్ధార్థ్‌లకు స్పెషల్‌ వీడియోతో విషెస్‌ చెప్పిన ‘RC15’ టీం

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్‌సీ15’ (RC 15). ఈ చిత్రబృందం కియారా అడ్వాణీకు శుభాకాంక్షలు తెలిపింది. మూవీ యూనిట్‌ అంతా ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Published : 13 Feb 2023 12:51 IST

హైదరాబాద్‌: రామ్‌ చరణ్ ‌(Ram Charan) హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా ‘ఆర్‌సీ15’ (వర్కింగ్‌ టైటిల్‌)(RC 15)గా ప్రచారంలో ఉంది. ఇందులో చరణ్‌ సరసన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అడ్వాణీ (Kiara Advani) నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు స్టార్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidharth Malhotra)తో కలిసి ఏడడుగులు వేసిన సందర్భంగా.. చిత్రబృందం ఈ జోడికి ప్రత్యేక వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. రామ్‌చరణ్‌, దిల్‌రాజు, శంకర్‌తో పాటు మూవీ యూనిట్‌ అంతా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోపై కియారా స్పందిస్తూ..‘‘ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీరంతా నా పై చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు’’ అని తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసింది. చాలారోజుల తర్వాత చిత్రబృందమంతా కనిపించేసరికి ఫ్యాన్స్‌ కూడా ఖుషీ అవుతున్నారు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవ్వాలని కోరుతూ కామెంట్స్‌ పెడుతున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది. చార్మినార్‌ వద్ద కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్‌ శంకర్‌ తన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎస్‌.జె సూర్య, అంజలి, నాజర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని