RC16: రామ్‌ చరణ్‌- బుచ్చిబాబు సినిమా పేరు ఇదేనా..! వైరలవుతున్న న్యూస్‌

రామ్‌ చరణ్‌ అప్‌కమింగ్‌ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోసల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది.

Published : 15 Mar 2024 13:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో ఓ ప్రాజెక్ట్‌ రానున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులైంది. దీంతో అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన వార్తను రామ్‌ చరణ్ (Ram charan) అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ పూర్తి వివరాలు మార్చి 20న ప్రకటించనున్నారట. ఆరోజే పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కు ‘పెద్ది’ (#RC16) అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌ సినిమా కోసం బుచ్చిబాబు రిజిస్టర్‌ చేశారని.. ఇప్పుడు అదే పేరును రామ్ చరణ్‌ సినిమాకు పెడుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి ఇందులో విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం.

మమ్మల్ని అర్థం చేసుకోండి.. ‘హనుమాన్‌’ ఓటీటీ రిలీజ్‌పై దర్శకుడి పోస్ట్‌

ప్రస్తుతం రామ్ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’తో బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వంలో పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఇది సిద్ధమవుతోంది. కియారా అడ్వాణీ హీరోయిన్‌. దీని షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. ఇందులో అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని