Ramcharan: శంకర్‌- రామ్‌ చరణ్‌ల మూవీ అప్‌డేట్‌..!

రామ్‌ చరణ్‌ , శంకర్‌ల సినిమా మరో షెడ్యూల్‌ షూటింగ్‌ రేపటి నుంచి ప్రారంభం కానుందని దానికోసం రామ్‌ చరణ్‌ ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారని సమాచారం.

Published : 09 Oct 2022 17:38 IST

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం మరో షెడ్యూల్‌ షూటింగ్‌ రేపటి నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానుందని దానికోసం రామ్‌ చరణ్‌ ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారని సమాచారం. ఆరు రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఫ్లాష్‌బ్యాక్‌ సీన్లు చిత్రీకరించనున్నారుట. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌గా వస్తున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన కియారా అడ్వాణీ నటించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పైన ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో అంజలి, జయరామ్‌, శ్రీకాంత్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని