Ram Prasad: నాకేమీ కాలేదు.. క్యాప్‌ పెట్టుకోవడానికి కారణమదే: జబర్దస్త్‌ రాంప్రసాద్‌

‘జబర్దస్త్‌’ వేదికగా ఆటో పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్‌ రాంప్రసాద్‌ (Ram Prasad). ప్రస్తుతం బుల్లితెరపైనే కాకుండా వెండితెర వేదికగానూ తన కామెడీ టైమింగ్‌తో ఆయన అలరిస్తున్నారు. 

Published : 11 Feb 2023 14:54 IST

హైదరాబాద్‌: తాను అనారోగ్యం బారినపడినట్లు ఇటీవల వచ్చిన పలు వార్తలపై జబర్దస్త్‌ కమెడియన్‌ రాంప్రసాద్‌ (Ram Prasad) స్పందించారు. అవన్నీ వదంతులు మాత్రమేనని తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. కొన్ని నెలల క్రితం తాను హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నానని.. అందుకోసమే ఇటీవల ఎక్కువగా తలకు క్యాప్‌ పెట్టుకునే బయటకు వస్తున్నానని అన్నారు. అయితే, ఈ విషయం తెలియక చాలామంది తనకు క్యాన్సర్‌, బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉందని ఇష్టం వచ్చినట్లు వార్తలు సృష్టించారంటూ వాపోయారు. అనంతరం, ఆయన సుడిగాలి సుధీర్‌ (Sudheer) పెళ్లి వార్తలపై స్పందిస్తూ.. కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ క్లిక్స్‌ కోసం ఇలాంటి థంబ్‌నెయిల్స్‌ పెడుతున్నారని, సుధీర్‌కి పెళ్లి జరిగిందంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని