Ranbir Kapoor: మరోసారి ట్రెండింగ్‌లోకి బాలీవుడ్‌ రామాయణం.. కారణమిదే..

అల్లు అరవింద్‌ (Allu Aravind) నిర్మాతగా నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రామాయణం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Published : 14 Dec 2023 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లతో కలిసి సినీ నిర్మాత అల్లు అరవింద్‌ ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) , సీతగా సాయి పల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌ కనిపించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో విశేషాలు సోషల్ మీడియాలో సందడి చేయగా.. తాజాగా మరోసారి ఈ ప్రాజెక్ట్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభించనున్నారట. దీని కోసం శ్రీలంకలో భారీ సెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ షేర్‌ అవుతుంది. ఇక దీని వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌ల కోసం నితేశ్‌ తివారీ టీమ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో సంప్రదింపులు జరిపిందట. ఈ చిత్రం కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగించాలని చిత్రబృందం యోచిస్తోందని అందుకే లుక్‌ టెస్ట్‌ కోసం కూడా త్రీడీ టెక్నాలజీని ఉపయోగించారని టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో మూవీ టీమ్‌ అంతా ఈ పనుల కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ఎంతో కీలకమైన రావణుడి పాత్ర యశ్‌ (Yash) చేయనున్నారట. 

ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది..: త్రిప్తి డిమ్రీ

తాజాగా ‘యానిమల్‌’తో రణ్‌బీర్ సూపర్‌ హిట్‌ను అందుకున్నారు. ఇటీవల ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే కొంత విరామం తీసుకున్న తర్వాత మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు చెప్పారు. దీంతో ఆ ప్రాజెక్ట్‌ రామాయణమేనని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి (Sai Pallavi) ‘తండేల్‌’లో నటిస్తున్నారు. అలాగే యశ్‌ ‘టాక్సిక్‌’ సినిమా చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని