సుధీర్‌ని ఇకపై అలా పిలుస్తా: రష్మి

‘ఈరోజు నుంచి సుధీర్‌ని నేను సుట్టి అని పిలుస్తా’ అంటూ సందడి చేసింది రష్మి.  ప్రదీప్‌ వ్యాఖ్యాతగా.. సుధీర్‌, రష్మి.. టీం లీడర్లుగా ఈటీవీలో ‘ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ రియాలిటీ షో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే.

Published : 25 Jun 2021 01:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ‘ఈరోజు నుంచి సుధీర్‌ని నేను సుట్టి అని పిలుస్తా’ అంటూ సందడి చేసింది రష్మి.  ప్రదీప్‌ వ్యాఖ్యాతగా.. సుధీర్‌, రష్మి.. టీం లీడర్లుగా ఈటీవీలో ‘ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ రియాలిటీ షో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. జూన్‌ 30 (బుధవారం) టెలికాస్ట్‌ అయ్యే ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులోనే సుధీర్‌ని సుట్టి అని పిలుస్తా అంటూ రష్మి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘ఆట’ సినిమాలోని ‘ఏం చాందిని రా’ అనే పాటకు డ్యాన్స్‌ చేసి కనువిందు చేశారు. ఎపిసోడ్‌కే స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. మరోవైపు రష్మి మాటల్ని ప్రదీప్‌ ఇమిటేట్‌ చేయడం నవ్వులు పూయించింది. డ్యాన్స్‌ కంటెస్టెంట్లు తమ తమ ప్రదర్శనలతో అదరగొట్టారు. వీళ్ల ప్రతిభని చూసి ప్రియమణి సైతం కాలు కదిపారు. ఈ హంగామా అంతా చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. అప్పటి వరకు ఈ ప్రోమో వీడియో చూసి ఆనందించండి... 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని