IPL 2023: ఐపీఎల్‌ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్‌ అనాల్సిందే!

ఐపీఎల్‌ ప్రారంభ వేడుకల్లో సినీ తారలు రష్మిక, తమన్నా తమ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించారు. 

Published : 31 Mar 2023 20:06 IST

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ (IPL 2023) ప్రారంభ వేడుకల్లో ప్రముఖ హీరోయిన్లు రష్మిక (Rashmika Mandanna), తమన్నా(Tamannaah) సందడి చేశారు. తమ డ్యాన్స్‌తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’, ‘పుష్ప’ చిత్రంలోని ‘శ్రీవల్లి’, ‘సామీ సామీ’ తదితర పాటలతో రష్మిక... ‘పుష్ప’లోని ‘ఊ.. అంటావా మావా.. ఊ ఊ.. అంటావా’, ‘ఎనిమీ’ సినిమాలోని ‘టమ్‌ టమ్‌’ పాటకు తమన్నా స్టెప్పులేసి అదుర్స్‌ అనిపించారు. ఈ ఇద్దరి పెర్ఫామెన్స్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం హోరెత్తింది. మరోవైపు, ప్రముఖ గాయకుడు అర్జిత్‌సింగ్‌ తన గాత్రంతో అలరించారు. ప్రస్తుతం ఐపీఎల్‌ 16వ సీజన్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) ఢీకొన్నాయి. ఆలస్యమెందుకు తమన్నా, రష్మిక ఎలా పెర్ఫామ్‌ చేశారో మీరూ చూసేయండి...



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు