Raveena Tandon: అక్షయ్‌తో బ్రేకప్‌.. దాదాపు పాతికేళ్ల తర్వాత పెదవి విప్పిన నటి

కథానాయికగా ఎన్నో ఏళ్ల పాటు సినీ ప్రియులను అలరించి.. ప్రస్తుతం సహాయ నటిగా రాణిస్తున్నారు నటి రవీనా టాండన్‌(Raveena Tandon). ‘కేజీయఫ్‌-2’లో రమీకాసేన్‌గా మెప్పించిన ఆమె తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

Published : 09 Feb 2023 01:42 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar)తో బ్రేకప్‌ కావడంపై దాదాపు పాతికేళ్ల తర్వాత నటి రవీనాటాండన్‌ (Raveena Tandon) స్పందించారు. అక్షయ్‌తో వివాహం రద్దైన ఆ క్షణాలను ఇప్పటికీ తాను మర్చిపోలేకపోతున్నట్లు చెప్పారు. ‘‘1994లో విడుదలైన ‘మోహ్రా’ సినిమా కోసం అక్షయ్‌, నేనూ కలిసి పనిచేశాం. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో మా జోడీకి అంతటా మంచి ప్రశంసలు లభించాయి. మేమిద్దరం రిలేషన్‌లోకి రావడం.. నిశ్చితార్థం.. వెంటనే బ్రేకప్‌ కూడా జరిగింది. అతడి జీవితం నుంచి నేను బయటకు వచ్చేశాను. అతడు వేరే అమ్మాయితో డేటింగ్‌.. నేనూ వేరే వ్యక్తితో రిలేషన్‌లోకి వచ్చాను. మా మధ్య ఎలాంటి అసూయకు తావులేదు. ఇప్పటికీ మేమంతా కలుస్తూనే ఉంటాం. మాట్లాడుకుంటాం. ఎవరి జీవితాలు వాళ్లు జీవిస్తూ ముందుకు సాగుతున్నాం. అయితే, మా నిశ్చితార్థం ఎప్పుడు జరిగిందనేది నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పటికీ నా మనసులో అలాగే ఉండిపోయాయి. వాటిని ఎందుకు గుర్తుపెట్టుకున్నానో తెలియడం లేదు. ఆ బ్రేకప్‌ తర్వాత కొంతకాలం పాటు పేపర్లు చదవలేదు’’ అని రవీనా వివరించారు.

‘మోహ్రా’ విజయం తర్వాత రవీనాటాండన్‌ - అక్షయ్‌ కుమార్‌ సూపర్‌హిట్‌ జోడీగా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 1995లో వీరిద్దరూ రిలేషన్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. తన కోస్టార్‌ ట్వింకిల్‌ ఖన్నాను అక్షయ్‌ 2001లో వివాహం చేసుకున్నారు. మరోవైపు రవీనా సైతం అనిల్‌ అనే వ్యాపారవేత్తతో ఏడడుగులు వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు