Tiger Nageswara Rao: ఆఖరి ఘట్టానికి టైగర్‌ నాగేశ్వరరావు

రవితేజ (Raviteja) కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). వంశీ దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు.

Updated : 06 Mar 2023 06:50 IST

వితేజ (Raviteja) కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). వంశీ దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. నూపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. రేణూ దేశాయ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ తాజాగా వైజాగ్‌లో ప్రారంభమైంది. రాత్రి వేళ జరుపుతున్న ఈ చిత్రీకరణలో ప్రధాన తారాగణమంతా పాల్గొంటోంది. ఈ విషయాల్ని చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. 1970ల నేపథ్యంలో సాగుతుంది. ఈ టైటిల్‌ పాత్ర కోసం రవితేజ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఇందులో ఆయన యాస, బాడీలాంగ్వేజ్‌ కొత్తగా ఉంటాయి. సంగీతం: జి.వి.ప్రకాష్‌, మాటలు: శ్రీకాంత్‌ విస్సా, ఛాయాగ్రహణం: ఆర్‌.మదీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని