Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ట్వీట్
Sai pallavi: తనకు పెళ్లైపోయిందంటూ వచ్చిన వార్తలపై సినీ నటి సాయి పల్లవి మండిపడ్డ్డారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించారు.
హైదరాబాద్: ‘సాయి పల్లవికి పెళ్లి అయింది.. ఇదిగో సాక్ష్యం.. సాయి పల్లవిని పెళ్లి చేసుకుంది ఎవరో తెలుసా? సాయి పల్లవిని పెళ్లి చేసుకున్న దర్శకుడు అతడే?’ ఇవి గత కొద్ది రోజులుగా యూట్యూబ్ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న హెడ్‌లైన్స్. ఆ ఫొటోలపై దర్శకుడు వేణు ఊడుగుల ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో సాయి పల్లవి (Sai pallavi) కూడా ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. చిత్ర పరిశ్రమలో తనపై వచ్చే రూమర్స్‌పై సాయి పల్లవి పెద్దగా స్పందించదు. అసలు వాటిని పట్టించుకోదు. కానీ, కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా ఇందులోకి లాగుతుండటంతో ఆమె స్పందించారు.
‘‘నిజం చెప్పాలంటే, రూమర్స్‌ను నేను అసలు పట్టించుకోను. కానీ, స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా ఇందులో భాగం చేస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందిస్తున్నా. నేను నటించిన ఓ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను క్రాప్ చేసి, డబ్బు కోసం, నీచమైన ఉద్దేశాలతో వాటిని ప్రచారం చేస్తున్నారు. నా సినిమాలకు సంబంధించి మంచి అప్డేట్స్ పంచుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి పనికిమాలిన విషయాలపై స్పందించడం నిజంగా బాధగా ఉంది. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం నిజంగా నీచమైన చర్యే’’ అంటూ సాయి పల్లవి అసహనం వ్యక్తం చేశారు.
నటి సాయి పల్లవికి సంబంధించిన ఓ ఫొటో రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామితో ఆమె ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. సాయిపల్లవి పెళ్లి చేసుకున్నారంటూ కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ‘SK21’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న సినిమా పూజా కార్యక్రమంలోని ఫొటో అది. మరోవైపు సాయి పల్లవి నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నటించనుంది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. #NC23 అనే వర్కింగ్ టైటిల్‌తో ఇది సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kiraak RP: సైలెంట్‌గా.. కిరాక్ ఆర్పీ వివాహం
కిరాక్ ఆర్పీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. -
Telangana assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. సినీ తారల ఫన్నీ మూమెంట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు సరదాగా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. -
Social Look: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మానస్.. చెమటోడ్చిన దివి
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Randeep Hooda: ప్రియురాలిని పెళ్లాడిన రణ్‌దీప్ హుడా.. వధువు ఎవరంటే?
నటుడు రణ్‌దీప్ హుడా తన ప్రియురాలిని వివాహం చేసుకున్నారు. మణిపురి సంప్రదాయం ప్రకారం ఇంఫాల్‌లో వీరి పెళ్లి జరిగింది. -
Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ నా బేబీ.. మిగతావేమీ పట్టించుకోలేదు: షాలినీ పాండే
నటి షాలినీ పాండే (Shalini Pandey) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy) సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. -
Vijayakanth: నటుడు విజయకాంత్ హెల్త్ బులెటిన్.. ఆస్పత్రి వర్గాలు ఏమన్నాయంటే?
నటుడు, డీఎండీకే అధ్యక్షుడు అధ్యక్షుడు విజయకాంత్ హెల్త్ బులిటెన్ విడుదలైంది. -
Naresh: డిప్రెషన్ నుంచి గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి..: నరేశ్ పోస్ట్ వైరల్
తన కెరీర్‌ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు నటుడు నరేశ్ (Naresh). -
Nithiin: టాలీవుడ్ హీరోకు సర్ప్రైజ్ ఇచ్చిన ధోని.. ఫొటో వైరల్
టాలీవుడ్ హీరో నితిన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన షేర్ చేశారు. -
Animal: ‘యానిమల్’ కోసం రణ్‌బీర్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే వావ్ అనాల్సిందే!
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. ఇందులో రణ్‌బీర్ లుక్‌పై ట్రైనర్ పోస్ట్ పెట్టారు. -
కౌన్‌బనేగా కరోడ్‌పతిలో సంచలనం.. రూ.కోటి గెలుచుకున్న 14ఏళ్ల బాలుడు.. ఆ ప్రశ్న ఏంటో తెలుసా?
Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్‌పతిలో 14ఏళ్ల బాలుడు రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పి, రికార్డు సృష్టించాడు. -
నిర్మాత వ్యాఖ్యలపై కోలీవుడ్ డైరెక్టర్స్ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన జ్ఞానవేల్ రాజా
కార్తి (Karthi) తొలి చిత్ర దర్శకుడు ఆమిర్ (Aamir)ను ఉద్దేశించి నిర్మాత జ్ఞానవేల్ రాజా (Gnanavel Raja) చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమిర్‌కు మద్దతు తెలుపుతూ తమిళ దర్శకులు వరుసగా ట్వీట్స్ చేశారు. -
Gautham Vasudev Menon: సినిమా వాయిదా.. గౌతమ్ మేనన్ ఎమోషనల్ పోస్ట్
గౌతమ్ వాసుదేవ్ మేనన్ (Gautham Vasudev Menon) తెరకెక్కించిన ‘ధృవ నక్షత్రం’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై గౌతమ్ ఎక్స్ (ట్విటర్)లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. -
Vishal: సీబీఐ ఆఫీస్‌కు వెళ్తానని జీవితంలో అనుకోలేదు: హీరో విశాల్
సీబీఎఫ్సీ కేసు విచారణలో భాగంగా హీరో విశాల్ (Vishal) సీబీఐ ఎదుట హాజరయ్యారు. తన జీవితంలో సీబీఐ ఆఫీస్‌కు వెళ్తానని ఊహించలేదంటూ పోస్ట్ పెట్టారు. -
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో రిషబ్ శెట్టి పాల్గొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. -
Social Look: చీరలో మాళవిక హొయలు.. జాక్వెలిన్ ట్రిప్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Pragathi: జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన నటి ప్రగతి..
సినీ నటి ప్రగతి (Pragathi) జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు. -
Rashmika: అవధులు లేని మీ అభిమానానికి కృతజ్ఞతలు.. స్పెషల్ ఫొటో షేర్ చేసిన రష్మిక
నటి రష్మిక (Rashmika) యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. -
Bobby Deol: బాబీ దేవోల్ చెప్పిన డైలాగ్ ఆ సినిమాలోదేనా! నెట్టింట ఆసక్తికర చర్చ..
బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ (Bobby Deol) చెప్పిన డైలాగ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది ఏ సినిమాలోదనే చర్చ మొదలైంది. -
Kriti Sanon: అల్లు అర్జున్‌తో నటించే అవకాశం త్వరగా రావాలనుకుంటున్నా..!
అల్లు అర్జున్‌తో (Allu arjun) కలిసి నటించాలని ఉందని కృతిసనన్ మరోసారి తన ఆసక్తిని బయటపెట్టారు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. -
Rashmika: అమ్మాయిలందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నా..: రష్మిక
తన డీప్ ఫేక్ వీడియోపై రష్మిక (Rashmika) మరోసారి స్పందించారు. తనకు చాలా మంది మద్దతు లభించిందన్నారు. -
Social Look: నీటితో సమస్యలకు చెక్ అన్న అదా.. మీనాక్షి స్ట్రీట్ షాపింగ్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...


తాజా వార్తలు (Latest News)
-
Nagarjuna sagar: సాగర్ డ్యామ్ వద్ద భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు.. మరోసారి ఉద్రిక్తత
-
Ola: ఇక ఓలా యాప్‌లోనూ యూపీఐ చెల్లింపులు
-
MS Dhoni: ఆ విషయంలో ధోనీ అందరి అంచనాలను తల్లకిందులు చేశాడు: డివిలియర్స్
-
Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో బోట్ గేమింగ్ ఇయర్‌బడ్స్
-
పన్నూ హత్యకుట్ర కేసులో యూఎస్ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన భారత్
-
DAC: సైన్యానికి బిగ్ బూస్ట్..! 97 ‘తేజస్’ యుద్ధవిమానాల కొనుగోలుకు పచ్చజెండా