Sai Pallavi: సీతగా సాయిపల్లవి.. ఆ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ..!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) తర్వాతి సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె సీతగా అలరించేందుకు సిద్ధమైందంటున్నారు.
హైదరాబాద్: ఫిదా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరచింది సాయిపల్లవి(Sai Pallavi). తర్వాత సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ యూత్‌కే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ దగ్గరైంది. తాజాగా ఈ అందాల తార తర్వాతి సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
సాయి పల్లవి బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. స్టార్‌హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటిస్తున్న ఓ సినిమాలో ఆయన సరసన ఈమె నటిస్తోందట. రణబీర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా సీతగా సాయి పల్లవి అలరించనుందట. ముందు ఈ పాత్ర కోసం దీపికా పదుకొణె(Deepika Padukone), కరీనా కపూర్(Kareena Kapoor) పేర్లు వినిపించాయి. కానీ దర్శకనిర్మాతలు సాయి పల్లవిని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక హృతిక్ రోషన్(Hrithik Roshan) ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం ప్రారంభం కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Chiranjeevi: ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
-
World News
Imran khan: ఇమ్రాన్ సంచలన నిర్ణయం.. 33 ఎంపీ స్థానాల్లో ఒక్కడే పోటీ
-
Ap-top-news News
Andhra News: మామూళ్లు ఇస్తే కోరిన వేతనం.. ఆయుష్ కాంపౌండర్లకు వాట్సప్ సందేశం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Ponguleti: ఏడున్నరేళ్లుగా ఇబ్బందులు పెట్టారు: పొంగులేటి
-
India News
Pathaan: ‘పఠాన్’ సినిమా కోసం పక్క రాష్ట్రానికి దివ్యాంగుడు