Salaar release date: ‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. అధికారికంగా ప్రకటించిన టీమ్‌

‘సలార్‌’ (Salaar) విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తోంది.

Updated : 29 Sep 2023 13:04 IST

హైదరాబాద్‌:  ప్రభాస్‌ (Prabhas) అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రానున్న ‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్‌ 22న ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలుపుతూ ట్వీట్‌ చేసింది. దీంతో ప్రభాస్‌ అభిమానులంతా సంబరపడుతున్నారు. మరోవైపు ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో మూడు హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ‘ఎక్స్‌’లో ప్రభాస్‌ ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ (#SalaarCeaseFire) హవానే కనిపిస్తోంది. 

 విడుదలైన వారంలోపే ఓటీటీలోకి.. ‘స‌ప్త సాగ‌రాలు దాటి’

మొదట ఈ సినిమాను సెప్టెంబర్‌ 28న విడుదల చేయాలని భావించారు. దీంతో ఈ తేదీకి నెల రోజుల ముందే అభిమానులు రోజుకో పోస్టర్‌తో కౌంట్‌ డౌను కూడా మొదలుపెట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో వారంతా నిరాశపడ్డారు. తాజాగా డిసెంబర్‌ 22న రానుందని తెలుపుతూ వారిలో మరోసారి ఉత్సాహాన్ని నింపింది ‘సలార్‌’ టీమ్‌. ఇప్పటికే విడుదలైన టీజర్‌ విశేషంగా అలరించి సినిమాపై అంచనాలు పెంచింది. హీరోని ఎలివేట్‌ చేస్తూ ప్రముఖ నటుడు టీనూ ఆనంద్‌ చెప్పిన ‘సింపుల్‌ ఇంగ్లిష్‌’ డైలాగ్స్‌, యాక్షన్‌ విజువల్స్‌ ప్రేక్షకులతో అదరహో అనిపించాయి. 24 గంటల్లోపే 83 మిలియన్ల వ్యూవ్స్‌ను సొంతం చేసుకుని ఇది రికార్డును సృష్టించింది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌ నటిస్తున్నారు. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని