Sapta Sagaralu Dhaati: విడుదలైన వారంలోపే ఓటీటీలోకి.. ‘స‌ప్త సాగ‌రాలు దాటి’

తాజాగా విడుదలైన ప్రేమకథా చిత్రం ‘స‌ప్త సాగ‌రాలు దాటి’. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరిస్తోంది (Sapta Sagaralu Dhaati on ott).

Published : 29 Sep 2023 10:03 IST

హైదరాబాద్‌: రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘స‌ప్త సాగ‌రాలు దాటి’ (Sapta Sagaralu Dhaati). సెప్టెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video) వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ ఇది అందుబాటులోకి వచ్చింది. మనసుకు హత్తుకునే ప్రేమకథగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన మేర కలెక్షన్లు వసూలు చేయలేకపోయింది. దీనికి హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించగా.. ప‌విత్ర లోకేశ్‌, అవినాష్‌, అచ్యుత్ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. 

రూ. 6.5 లక్షలిచ్చా.. సెన్సార్‌ బోర్డులోనూ అవినీతి.. ఆరోపించిన విశాల్‌

క‌థేంటంటే: మ‌ను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వ‌సంత్‌) ఓ ప్రేమ‌జంట‌. శంక‌ర్ గౌడ (అవినాష్‌) అనే పారిశ్రామిక వేత్త ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు మ‌ను. ఒక‌వైపు చ‌దువుకుంటూనే మ‌రోవైపు గాయ‌ని కావాల‌నుకుంటుంది ప్రియ‌. మ‌ధ్య త‌ర‌గ‌తికి చెందిన ఈ జంట భ‌విష్య‌త్తు గురించి అంద‌మైన క‌ల‌లు కంటూ... పెళ్లి చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంటుంది. తొంద‌ర‌గా జీవితంలో స్థిరపడొచ్చనే ఆశ‌తో చేయ‌ని త‌ప్పుని త‌నపైన వేసుకుంటాడు మ‌ను. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది?క‌ల‌లు క‌న్నంత అందంగా ఈ ప్రేమజంట భ‌విష్య‌త్తుని తీర్చిదిద్దుకుందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని