Sandeep Reddy Vanga: నా మాటలకు ఆ నటి బాధపడింది: సందీప్‌ రెడ్డి వంగా

‘యానిమల్‌’ (Animal)లో హీరోయిన్‌ పాత్రకు తన తొలి ఛాయిస్‌ రష్మిక (Rashmika) కాదని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెలిపారు.  

Published : 24 Dec 2023 13:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కబీర్‌సింగ్‌’ (Kabir Singh)తో కియారా అడ్వాణీ (Kiara Advani), ‘యానిమల్‌’ (Animal)తో రష్మికకు (Rashmika) విజయాన్ని అందించారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). అయితే, ఈ చిత్రాల్లో హీరోయిన్‌ పాత్రకు తన మొదటి ఛాయిస్‌ మాత్రం బాలీవుడ్ నటి పరిణీతి చోప్రానే అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. కొన్ని కారణాల వల్ల ఆమెతో కలిసి వర్క్‌ చేయడం వీలు పడలేదన్నారు. ముఖ్యంగా ‘యానిమల్‌’ విషయంలో ఆమెకు ‘సారీ’ చెప్పానని తెలిపారు.

‘‘పరిణీతి చోప్రా నటన అంటే నాకెంతో ఇష్టం. నా చిత్రాల్లో ఆమెను హీరోయిన్‌గా ఎంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ‘కబీర్‌సింగ్‌’లో ప్రీతి పాత్రకు ఆమెనే తీసుకోవాలని తొలుత భావించా. కాకపోతే, కొన్ని కారణాల వల్ల మా కాంబో కార్యరూపం దాల్చలేదు. ఈ విషయం ఆమెకు కూడా తెలుసు. ‘యానిమల్‌’లో హీరోయిన్‌గా ఆమెను ఎంచుకున్నప్పుడు సంతోషంగా అనిపించింది. షూట్‌ మొదలు కావడానికి ఏడాదిన్నర ముందే ఆమె ఈ ప్రాజెక్ట్‌కు సంతకం చేసింది. సినిమాకు సంబంధించిన కొన్ని విషయాల పరంగా ఆమెలో గీతాంజలిని (యానిమల్‌లో హీరోయిన్‌ పాత్ర పేరు) చూడలేకపోయా. ఇదే విషయాన్ని చెప్పా. ‘‘సారీ. సినిమా కంటే ఏదీ ఎక్కువ కాదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ‘యానిమల్‌’ కోసం మరో నటిని తీసుకోవాలనుకుంటున్నా’’ అని చెప్పా. నా మాటలకు ఆమె ఎంతో బాధపడింది. కాకపోతే, నేను ఎందుకు అలా చెప్పానో అర్థం చేసుకుంది’’ అని సందీప్‌ తెలిపారు.

Ram Charan: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్‌.. లీగ్‌ క్రికెట్‌లోకి రామ్‌చరణ్‌..!

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్‌’. అనిల్‌కపూర్‌, బాబీ దేవోల్‌, త్రిప్తి డిమ్రి కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో గీతాంజలిగా రష్మిక నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని